తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా తయారయ్యింది జగన్ వ్యవహారం. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్టంలో ప్రస్తుతం ఆయనే ఓ ప్రతిపక్షనేత. అసలు ప్రతి పక్షనేత అంటే ఎలా ఉండాలి ఎంత హుందా తనంగా ఉండాలో వైఎస్సార్ ని చూస్తే తెలుస్తుంది. కానీ జగన్ మటుకు తనకు కావాల్సినవాటి గురించి పదే పదే ప్రస్తావించే విచిత్రమైన నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి జరిగే అన్యాయాల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి.. ఆ వ్యవహారం పక్కకు నెట్టి తన సొంత విషయాలపై వ్యాఖ్యానించడం ఎంత వరకు న్యాయం అని పలువురు అనుకుంటున్నారు.

తాజాగా అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్రలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కాస్త చిత్రంగా ఉండటం గమనార్హం. ఏపీలో తెలుగుదేశం పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చి కేవలం తొమ్మిది నెలలుమాత్రమే అయ్యిందన్నవిషయాన్ని మర్చిపోయి ఆవేశంతో ఊగిపోవటం.. బాబు సర్కారును కూకటివేల్లతో కూల్చాలని పిలుపునివ్వటంలో అర్థం జగన్‌బాబుకే తెలియాలి. బలమైన ప్రజాబలం ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని కూల్చటం తేలికైన వ్యవహారం కాదు.

బాబు పాలనలోని తప్పుల్ని ఎత్తి చూపించే కన్నా.. ఆయనను అధికారంలో నుంచి దించేసే విషయం మీదనే ఎక్కవ ఫోకస్‌ పెట్టటం జగన్‌ ప్రత్యేకత. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయటం బాబు ఫెయిల్‌ అయ్యారని జగన్‌ తేల్చేశారు. అంతేకాదు.. ప్రభుత్వం ఏర్పాటు చేసి తొమ్మిది నెలలే అన్న విషయాన్ని జగన్‌ కావాలని మర్చిపోయినట్లున్నారు. వీటన్నింటికి తోడు.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని..

అందుకే.. బాబుపై 420 కాదు.. 840 కేసు పెడదామా అంటూ వ్యాఖ్యానించారు. సెక్షన్‌ 420 అంటే మోసగించటం.. కానీ.. ఈ 840 సెక్షన్‌ ఏమిటి జగన్‌ బాబు అంటూ ప్రశ్నిస్తున్నారు. విమర్శించటం అంటే నోటికి వచ్చినట్లు మాటలు అనేయటం కాదన్న విషయాన్ని జగన్‌ ఎప్పటికి తెలుసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: