వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు కొత్తగా వినోదాన్ని కూడా డిస్తున్నారు. ఇంతకాలం ఈ రైళ్లలో ఉచితంగా టీ, స్నాక్స్, భోజనాలు ఇచ్చేవారు. టికెట్ ధరలోనే వీటి ధర కూడా కలిపి ఉండేది. ఇది ప్రయాణికులకు చాలా సౌఖ్యంగా ఉండేది.

దూరప్రయాణాల్లో ప్రత్యేకంగా భోజనాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్లలో నాణ్యమైన ఆహారమే అందించేవారు. ఇప్పుడు దీనికితోడు వినోదాన్ని కూడా జోడిస్తే.. ఈ రైళ్లకు మరింత ఆదరణ లభించడం ఖాయం. వోల్వో బస్సులు, ఇతర దూరప్రాంత బస్సుల్లో ఎల్ఈడీ టీవీలలో సినిమాలు వేయడం మనకు ఎప్పటినుంచో తెలుసు.

మరి శతాబ్ది రైళ్లలో కూడా ఇలాగే సినిమాలు చూపిస్తారో, లేక పాటలు వినిపిస్తారో చూడాల్సి ఉంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైలు ప్రయాణికులకు ఓ కొత్త వరం ప్రకటించారు. అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఇపుడున్న 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. ఇంతకుముందు 90 రోజుల ముందుగానే ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ తర్వాత దాన్ని 60 రోజులకు తగ్గించారు.

దాంతో 60 రోజుల వరకు ఆగిన తర్వాత మాత్రమే ముందుగా ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చేది. తాజాగా రైల్వే మంత్రి చేసిన ప్రకటనతో.. 120 రోజులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఏర్పడింది. అయితే ఇది కొంత మందికి వరంగానే పరిణమిస్తుంది గానీ.. కొందరికి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్లకు బాగా ముందే టికెట్లు మొత్తం బుక్ అయిపోవడంతో.. తర్వాత చేసుకుందామని ఆగేవాళ్లకు టికెట్లు దొరికే అవకాశం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: