మోడీ ప్రభుత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై లోక్ సభలో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి ప్రసంగం ప్రారంభించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 138ను రైల్వే మంత్రి ప్రవేశపెట్టారు. ఈ నెంబరు 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన అంశాల కోసం మరో టోల్‌ఫ్రీ నెంబరు 132ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే వ్యవస్థలోనూ స్వచ్ఛభారత్‌కు ప్రాధాన్యత ఇస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అందులోని కొన్ని ముఖ్యాంశాలు...

- పేదరిక నిర్మూలనే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. - రైల్వేలో పారిశుద్ధ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. - మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే అదనపు పెట్టుబడులు అవసరం. - రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం. - బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం. - రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్. - వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు.

- ఛార్జీలు పెంచే యోచన లేదు. - ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం. - రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు. - ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది. - పాతవాటిని తొలగించాలి...కొత్తవి నడపాలి. - కాలం చెల్లిన రైళ్లను నడపాల్సి వస్తోంది. - పెండింగ్ ప్రాజెక్ట్‌ల పూర్తికి ప్రాధాన్యత. - భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన. - రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. - గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు. - దేశాభివృద్ధిలో రైల్వేలదే కీలక పాత్ర. - రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది. - రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది. - పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి. - ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి.

- పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం. - అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది. - దేశ సామాజిక ప్రగతిలో రైల్వేలది కీలక భూమిక అనే విషయాన్ని మా ప్రభుత్వం దృష్టిలో వుంచుకుంటుంది. - కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం. - ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా? - రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు. - శతాబ్ధి ఎక్స్ ప్రెస్‌ను గంటకు 125 కిలోమీటర్లు పెంచలేమా? - రాజధాని, శతాబ్ధి రైళ్లు అనుకున్న విధంగా నడవటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: