ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక పరులనుభవించునా దేవా.. పాట గుర్తుందికదా అవున మరి మనీ లాండరింగ్ కేసు జగన్ కి శనిలా పట్టి కూర్చుంది. ఈ కేసులో ఆయనకు మరో దెబ్బ తగిలింది. తండ్రి హయాంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడన్న విషయంపై కొంత కాలం వైఎస్ జగన్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

ఆయన పై పలు కేసులు కూడా దాఖలైనాయి. ఆ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ ఎన్నో నిరసనలు చేప్పపట్టారు. పార్లమెంట్ లో కూడా వ్యతిరేకించారు. రాష్ట విభజన తర్వాత ఎన్నికల్లో నిలబడి తెలుగు దేశం పార్టీకి గట్టి పోటీనే ఇచ్చారు.

కాంగ్రెస్, బిజేల కంటే వైఎస్సార్ సీపీ ఎక్కు సీట్లు గెల్చుకొని ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మరిన్ని ఆస్తులను అటాచ్‌మెంట్ చేశారు.

మొత్తం రూ.232 కోట్ల ఆస్తులను జత చేశారు. జననీ ఇన్‌ఫ్రా, ఇండియా సిమెంట్ స్థలాలు, ఆస్తులను అటాచ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ పైన అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: