రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వడానికి సుముఖంగా లేని రైతులను మరోసారి హెచ్చరించారు. భూ సమీకరణ గడువును ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత పొడిగించబోమని, ఆ తర్వాత భూ సెకరణ చట్టం ప్రయోగిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

విజయవాడలో రాజధాని ప్రాంతంలో ప్రత్యేకించి జరీబు భూముల రైతులతో సమావేశం అయ్యారు. ఎకరాకు మరో 200 గజాల స్థలం అదనంగా ఇవ్వాలని వారు కోరారు.కొందరు కనీసం వంద గజాల స్థలం ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

భూములను అప్పగించి రాజధానికి సహకరించాలని చంద్రబాబు వారిని కోరారు. ఎకరంలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు అదనపు నిధులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పొలాలు తీసుకున్న గ్రామాల్లోనే ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

మల్లెతోటలున్న నిడమర్రు, కురగల్లు, బేతపూడి, ఉండవల్లి గ్రామాల పొలాలను కూడా జరీబు భూములుగా గుర్తించాలని కొందరు కోరారు. రాత్రిలోగా ఏ సంగతి చెబుతామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: