తెలుగుదేశం పార్టీ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. అధికారం ఉందనే అహంకారంతో మేమేం చేసినా చెల్లుతుందనే ధైర్యంతో టీడీపీ అమృతలూరు మండల అధ్యక్షుడు తహశీల్దార్ కార్యలయంలో వీరంగం సృష్టించాడు. వివరాలు.. గుంటూరు జిల్లా అమృతలూర్ మండలానికి దీపం పథకం కింద 256 గ్యాస్ కనెక్షన్‌లు మంజూరయ్యాయి.

మండల టీడీపీ అధ్యక్షుడు ఎలవర్తి బ్రహ్మానందం గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యలయానికి వచ్చి తాము చెప్పిన వారికే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వాలని కోరారు.

దీనికి ఇంచార్జ్ తహశీల్దార్ ససేమిరా అనడంతో కార్యాలయంలోని టేబుల్‌ను ఎత్తెయడంతో టేబుల్ విరిగిపోయింది. ఇంతటితో ఆగకుండా అధికారిని దుర్భాషలాడాడు. ఇందులో బ్రహ్మానందంతో పాటు అదే పార్టీకి చెందిన కాంట్రాక్టర్ నార్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకున్నారు.

సీఎం చంద్రబాబు సదరు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని, టీడీపీ శ్రేణులకు ప్రయోజనం కలిగించేలా జీవోలు జారీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: