రైల్వే బడ్జెట్ పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. బడ్జెత్ అదరగొడతారనుకున్న సురేష్ ప్రభు.. తుస్సుమనిపించారంటూ.. ఎద్దేవా చేశాయి. పూర్తిస్తాయిలో సమాచారం లేకుండా.. మంత్రి ఎలా బడ్జెట్ ప్రవేశపెడతారంటూ ప్రశ్నించాయి. సర్కారీ ఆలోచనలు సరే , కనీసం తమ ఎక్స్ పెక్టేషన్స్ కూడా మంత్రి చేరుకోలేకపోయారని ఆరోపించాయి. ఎలాంటి కేటాయింపులు ప్రతిపాదనలు లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత.. ఎన్డీయే దే అంటూ వాగ్బాణాలు సంధించాయి.

అటు సభలోనూ నిరసనలను చవిచూశారు సురేష్ ప్రభు. ఎంపీలంతా నియోజక అభివృద్ధి నిధులను.. రైల్వేలకు విరాళంగా ఇవ్వాలంటూ ఆయన చేసిన కామెంట్స్ పై విపక్షాలన్నీ స్పందించాయి. అసలే చాలీచాలని నిధులతో నెట్టుకొస్తోంటే. ఇంకా విరాళాలు కూడానా అంటూ రన్నింగ్ కామెంటరీ చేశారు.

బడ్జెట్ కన్ క్లూజింగ్ కు వచ్చినపుడు కూడా.. ప్రభుకు నిరసనగళాలు వినిపించాయి. కేటాయింపులు కొత్తప్రాజెక్టులు సర్వేలు ప్రతిపాదనలకోసం ఎదురుచూస్తండగానే వాటి ప్రస్తావన లేకుండా.. ఎండ్ కార్డ్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్వీచ్ ముగిసే సమయంలో సభలో నినాదాలతో హోరెత్తించాయి విపక్షాలు.

అటు సభ బయటకూడా అధికారపక్షాన్ని వదల్లేదు.. ప్రతిపక్షాలు. మీడియాముందు సర్కారుపై విమర్శల జడివాన కురిపించాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలపై కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు కమలనాథులు..పనిఒత్తిడితో ఉన్న ఉద్యోగులు పూర్తిసమాచారం ఇవ్వలేకపోయారని త్వరలోనే ఆ పనిని కూడా కంప్లీట్ చేస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: