ఆంధ్రా విద్యార్థులకు ఇప్పుడు ఒక కొత్త గందరగోళం వచ్చిపడింది. లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే పరీక్షల విషయంలో క్లారిటీ కరవైంది. ఒకే రోజు రెండు ప్రధాన పరీక్షలు జరగనుండటంతో రెండింటిలో ఏదో ఒకటి వాయిదా పడవచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రెండు పరీక్షల నిర్వాహకులు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండంటో పరీక్షలకు హాజరుకాబోయే వారి బీపీ రైజవుతోంది.

మే 10 న ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని ముందే నిర్ణయించారు. మే 9 నుంచి 11 వరకూ డీఎస్సీ పరీక్షలకు కూడా ముహూర్తం నిర్ణయించారు. వాస్తవానికి ఈ రెండు పరీక్షలకు హాజరయ్యేవారికి దీనివల్లఇబ్బందేమీ ఉండదు. ఎంసెట్ రాసేవారు డీఎస్సీ రాయరు.. డీఎస్సీ రాసేవారు ఎంసెట్ రాయరు.. కాకపోతే అతి స్వల్పశాతం మంది మాత్రం రెండూ రాసే అవకాశం ఉన్నా.. వారు ఏదో ఒకదానివైపు మొగ్గే ఛాన్సుంది.

కాకపోతే పరీక్షల నిర్వహణలోనే అసలు చిక్కంతా వచ్చింది. రెండు పెద్ద పరీక్షలే లక్షల మంది విద్యార్థులు వీటికి హాజరవుతారు. భారీ సంఖ్యలో పరీక్షాకేంద్రాలు అవసరం. ఎంసెట్ కు రెండు లక్షల మంది హాజరు కావచ్చని ఓ అంచనా. దీనికోసం 500 వరకూ కేంద్రాలు అవసరం. 400 కేంద్రాలు కావాలని ప్రాథమికంగా అంచనా వేశారు.

మే 10 న ఎంసెట్ నిర్వహించాలనుకుంటే.. కనీసం ఒకరోజు ముందుగా అయినా పరీక్షా కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలి. నెంబర్లూ గట్రా వేసుకోవాలి. కానీ డీఎస్సీ పరీక్షల వల్ల అది సాధ్యంకాదు. మే 14న తెలంగాణ ఎంసెట్ ఉన్న విషయాన్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల ఎంసెట్, డీఎస్సీల్లో ఏదో ఒకటి వాయిదా పడటం ఖాయమని చెబుతున్నారు. దీనిపై ఏపీ సర్కారు.. త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: