తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అంటున్నాడు నారా లోకేష్ బాబు. ఖర్చు పెట్టకుండానే ఇంత భారీ మెజారిటీతో గెలిచేశామని ఆయన చెప్పుకొచ్చాడు. మరి లోకేష్ బాబు ఇలా ప్రకటించుకోవడం వరకూ బాగానే ఉంది కానీ... నిజంగానే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని నమ్మేయలేం. ఎందుకంటే.. ఏ రాజకీయ పార్టీ అయినా.. తమ గురించి తాము నిజాయితీ పరులమని చెప్పుకొంటుంది.

తాము నీతిమంతులమని.. డబ్బు ఖర్చు చేయకుండానే గెలుస్తున్నామని చెప్పుకొంటుంది. ఈ పరంపరలో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి.. తామను మించిని నిజాయితీ పరులు లేరనే నేతల్లో లోకేష్ కూడా ఒకరంతే. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం మరోటి కూడా ఉంది.

తిరుపతి ఉప ఎన్నికలు సానుభూతి కోటాలో జరిగినవి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అడ్డుపుల్ల వేయడంతో ఈ ఉప ఎన్నిక పోలింగ్ వరకూ వచ్చిందంతే! మరి ఇలాంటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ డబ్బు ఖర్చు చేయలేదని చెప్పుకోవడం చోద్యమే. ప్రచారమే చేయకుండానే తెలుగుదేశం గెలవొచ్చు. అలాంటిసానుభూతి పరమైన పరిస్థితులున్నాయి.

స్వయంగా లోకేష్ బాబు ప్రచారానికి దిగాడు. మరి ఇలాంటి ఎన్నికల్లో తాము అంత నిజాయితీగా వ్యవహరించామని తెలుగుదేశం చెప్పుకోవడం విడ్డూరమే! అయినా.. డబ్బు పంచకుంటేనేం.. రిగ్గింగ్ గురించి గట్టి ఆరోపణలే వచ్చాయి కదా! దొంగ ఓట్లు వేస్తున్న వారిని స్వయంగా పట్టించింది కాంగ్రెస్ అభ్యర్థి. మరి అలాంటి ఎన్నికల ప్రహసనంలో తాము నిజాయితీగా వ్యవహరించామని టీడీపీ అధినేత తనయుడు చెప్పుకోవడం కొంత వరకూ కామెడీనే!

మరింత సమాచారం తెలుసుకోండి: