పురుషుడి కడుపులో ఉన్న గర్భాశయాన్ని కోలారులోని ఆర్‌ఎల్ జాలప్ప వైద్యులు శస్త్రచికిత్స చేసి వెలికి తీశారు. అరుదైన ఘటనకు సంబంధించిన వివరాలు.. కోలారు జిల్లాకు చెందిన వ్యక్తి(58) కడుపునొప్పితో ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో ఇటీవల చేరాడు. హెర్నియాతో బాధపడుతున్నాడంటూ అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆ సమయంలో కడుపులో గర్భాశయం, అండాశయం, స్త్రీ జననాంగ భాగాలు ఉన్నట్లు గుర్తించి విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.ఎన్.శ్రీరాములుకు తెలిపారు. అనంతరం పరిస్థితిని రోగికి వివరించి అతని అనుమతితో గురువారం శస్త్రచికిత్స నిర్వహించి గర్భాశయం,

అండాశయం తొలగించారు. శస్త్రచికిత్సలో వైద్యులు శ్రీనివాస్, సోమశేఖర్, ఆనంద్, పవన్ కట్టి, సిబ్బంది పాల్గొన్నారు. పుట్టుకతో హార్మోన్ల లోపం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, ఫలితంగా అతనికి సంతాన ప్రాప్తి లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఇతనికి ఒకే వృషణం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.

వెలికి తీసిన ఆర్‌ఎల్ జాలప్ప వైద్యులు పుట్టుకతో హార్మోన్ల లోపం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, ఫలితంగా అతనికి సంతాన ప్రాప్తి లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఇతనికి ఒకే వృషణం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: