కొత్తగా ప్రభుత్వం ఏర్పరిచిన ఉత్సాహంలో మోడీ సర్కారు చాలా విషయాలను ప్రకటించింది. అద్బుతాలు చేయబోతున్నామని ప్రకటించింది, అయితే అవన్నీ ఒట్టి ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. గత ఏడాది రైల్వే బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం ప్రకటించిన విషయాలను ఇక్కడ కచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఆ ప్రకటనల్లో ముఖ్యమైనవి... బుల్లెట్ రైళ్లు.. కాపాలాలేని రైల్వేగేట్లు ఉండబోవనే అంశాలు.

మోడీ సర్కారు వస్తూ వస్తూనే బుల్లెట్ రైళ్ల గురించి ప్రకటన చేసింది. దేశ జనులు కూడా ఆ ప్రకటనతో ఆశ్చర్యపోయారు. ఏదో అద్భుతం జరిగిపోతోందని అనుకొన్నారు. చైనా, జపాన్ వంటి దేశాల్లో లాగా ఇండియాలో కూడా బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని ఆశించారు. అలాగే కాపాలా లేని రైల్వే గేట్లు ఉండవని క్రితం సారి మోడీ ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో కాపాలాలేని రైల్వే గేట్లు కోకొల్లలు. ఇలాంటి చోట్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. తెలంగాణలో గత ఏడాది ఒక స్కూలు బస్సు కాపాలా లేని రైల్వే గేటు వద్ద ప్రమాదానికి గురైంది. ఇలాంటి ప్రమాదాలు దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి.

ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకొంటామని గత బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సారి ఈ రెండు అంశాల విషయంలోనూ మోడీ సర్కారు మొండిచేయి చూపింది! బుల్లెట్ రైళ్ల అంశం గురించి కానీ... రైల్వే గేట్ల వద్ద భద్రత అంశం గురించి కానీ.. బడ్జెట్ లో పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం వంద కోట్ల రూపాయల ప్రకటనతో చాలించారు. మరి గత బడ్జెట్ లో స్వయంగా కమలనాథులే ప్రకటించిన అంశం గురించి అప్పుడే ఇంత నిర్లక్ష్యం చూపడం ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: