రాజకీయా సంక్షోభాలకు విశాఖ పెట్టింది పేరు ఇక్కడి రాజకీయ నాయకులు ఎప్పడు ఏ రూట్ మారుస్తారో ఎవరు తమ మద్దతు పలుకుతారో ఎప్పడు ఎవరిని విమర్శస్తారో తెలియదు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ పాలన సాఫీగా సాగుతుందీ అనుకున్న సమయంలోనే ఇక్కడ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం మొదలు పెట్టారు. ఇది విపక్షాలకు వినసోంపైనా స్వపక్షానికి మాత్రం కొరకరాని కొయ్యలా తయారైంది.

ముఖ్యంగా విశాఖ జిల్లాలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్ మధ్య ఉన్న వార్‌కు తోడుగా ఇప్పుడు కొత్త పోరు ప్రారంభమైంది. ఈ సారి మంత్రి అయ్యన్నకు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు మధ్య వివాదం జరుగుతోంది. జిల్లాలోని అభివృద్ది కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గంలో రూ 6.31 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం మాడుగుల వస్తున్నారు.

అయితే స్థానిక ఎంపీ లేకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎలా చేస్తారని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ యువరాజ్‌కు లేఖ రాశారు. ఆ కార్యక్రమం అడ్డుకోకపోతే సభాహక్కుల నోటీసులు ఇస్తానని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడు పర్యటన చివరి నిమిషం వరకు అడ్డుకోవాలని మంత్రి గంటా వర్గం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ ఎత్తులన్ని వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ది కార్యక్రమాల్లో తాము మాడుగులలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: