పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.చంద్రబాబు నాయుడు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. జపాన్ ,సింగపూర్ వెళ్లి ఎవరితో మాట్లాడారో పరిశీలిస్తే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని బొత్స అన్నారు.

ఎపిలో పాలన జరగడం లేదని, రాజకీయ వ్యాపారమే జరుగుతోందని ఆయన అన్నారు.చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇప్పటివరకూ విచారణ జరగలేదని, విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారని ఆయన అన్నారు.

విచారణ జరిగితే చంద్రబాబు దందాలు, వ్యాపారాలు బయటపడతాయని బొత్స వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పారదర్శకత లోపించిందన్నారు. ప్రజా ధనాన్ని దోచుకునేందుకే పట్టిసీమ ప్రాజెక్ట్ను చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.

పోలవరం లేటు అవుతుందనే సాకుతో సాంకేతికంగా సాధ్యం కాని ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని బొత్స విమర్శించారు. చంద్రబాబు సింగపూర్ , జపాన్ లు పర్యటించినప్పుడు అంత అభ్యంతరకర వ్యక్తులు ఎవరు ఉన్నారో బొత్స చెబుతారా!

మరింత సమాచారం తెలుసుకోండి: