ముంబై టు గోవా. గోవా టు హైదరాబాద్. సముద్రం లేదు కానీ.. ఇంకా ఈజీగా జరిగేదేమో స్మగ్లింగ్! పెరుగుతోన్న డ్రగ్స్ దందా చూస్తే ఇదే అనిపిస్తోంది. అటు నుంచే ఇటొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ సెలబ్రిటీలు.. బడా బాబులే.. డ్రగ్స్ దందాకి కస్టమర్లు. సేల్స్ మెన్లు కూడా వాళ్లే. అందుకే బిజినెస్ ఇంకాస్త పెరుగుతోంది.

ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. దొరక్కుండా ట్రాన్స్ పోర్టు చేసేస్తున్నారు డ్రగ్స్ స్మగ్లర్లు. డబ్బున్నోళ్ల పిల్లలే టార్గెట్ గా డ్రగ్స్ రవాణా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పబ్బులు.. రిసార్టుల్లో దీని సేల్స్ ఎక్కువగా ఉందనేది అందరికీ తెలిసిందే. డ్రగ్స్ ముఠాలు.. రెగ్యులర్ గా దొరుకుతూనే ఉన్నాయి.

నైజీరియన్లపై నిఘా పెంచిన పోలీసులు.. రీసెంట్ గా కూడా ఓ బ్యాచ్ ని పట్టుకున్నారు. వీరితోపాటు సినీ డైరెక్టర్ సుశాంత్ దొరికిపోయాడు. ఆర్కే మీడియ కన్వీనర్ రవికుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి కొకైన్ గంజాయి.. ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

సిటీ శివారు.. నగరం నడి మధ్య అనే తేడా లేదు. అన్నిచోట్లా డ్రగ్స్ రవాణా ఫుల్ గానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. లోకల్ పీపుల్ ని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తున్న స్మగ్లర్లు.. దందా రన్ చేస్తున్నారు. పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే అక్రమ బిజినెస్ పెరిగిందనే వారూ లేకపోలేదు. లక్షల మంది యువత సిటీలో ఇలాంటి డ్రగ్స్ కి బానిసలైపోయినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: