బంగారం.. దీనిపై భారతీయ మహిళకు ఉన్నంత మోజు వేరే ఎక్కడా కనిపించదు. బంగారు నగలు..వారి అందాన్ని ఇనుమడింపజేయడమే కాదు.. వారికి సమాజంలో ఓ స్టేటస్ ఇస్తాయి. అందుకే రేటెంత పెరిగినా బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గవు. రెండు, మూడేళ్ల క్రితం పరుగులు పెట్టిన బంగారం రేట్లు.. కొన్నాళ్లుగా నిలకడగా ఉన్నాయి.

ఐతే.. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తెలంగాణలో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరగనున్నాయి. కేసీఆర్ నిర్ణయంతో ఒక్క తెలంగాణలోనే ఈ రేట్ల పెంపు ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో వ్యాట్ 1 శాతంగా ఉంది. దీన్ని దాదాపు 5 శాతం వరకూ పెంచాలని నిర్ణయించేసింది. వ్యాట్ ఒక్క శాతం అనేది చాలా తక్కువ అని.. దాన్ని 5 శాతం పెంచితే పెద్దగా భారం ఉండదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

బంగారం విక్రయాలకు జంట నగరాలు పెట్టింది పేరు. హైదరాబాద్, సికింద్రాబాద్ లల్లో వందల సంఖ్యలో బంగారం దుకాణాలున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా రెండు తెలుగు ప్రాంతాలవారు బంగారం కొనుగోళ్ల కోసం ఎక్కువగా హైదరాబాద్ కే వస్తుంటారు. అందుకే ఇక్కడ ఒక్క శాతం వ్యాట్ పెంచినా దాదాపు 10 కోట్ల రూపాయల ఆదాయం ఏడాదికి వస్తుంది.

అందుకే ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తున్న కేసీఆర్ సర్కారు బంగారంపై పన్ను పెంచేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై ఇప్పటికే రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కూలంకషంగా చర్చించారట. సూత్రప్రాయంగా ఓ వ్యాట్ పెంచేందుకు నిర్ణయించేశారట. ఇక అధికారిక ప్రకటన విడుదల చేయడమే తరువాయి. ఈ బంగారం పై వ్యాట్ పెంపు నిర్ణయంతో ఏటా తెలంగాణ సర్కారుకు ఏడాదికి 500 కోట్ల వరకూ ఆదాయం పెరిగే ఛాన్సుందట. అదీ కేసీఆర్ గోల్డెన్ షాక్ వెనుక ఉన్న అసలు సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: