విశాఖ జిల్లాలో ఇప్పటికే మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్ మధ్య ఉన్న వార్‌కు తోడుగా ఇప్పుడు కొత్త పోరు ప్రారంభమైంది. ఈ సారి మంత్రి అయ్యన్నకు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు మధ్య వివాదం జరుగుతోంది.

జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో రూ 6.31 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం మాడుగుల వస్తున్నారు. అయితే స్థానిక ఎంపీ లేకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎలా చేస్తారని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ యువరాజ్‌కు లేఖ రాశారు. ఆ కార్యక్రమం అడ్డుకోకపోతే సభాహక్కుల నోటీసులు ఇస్తానని హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడు పర్యటన చివరి నిమిషం వరకు అడ్డుకోవాలని మంత్రి గంటా వర్గం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ ఎత్తులన్ని వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్లెక్సీలతో ముంచెత్తారు. బలనిరూపణలో భాగంగా ఈసందర్భంగా భారీ బహిరంగ సభ కూడా తలపెట్టారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ పర్యటనలో పాల్గొంటారని గవిరెడ్డి తెలిపారు.

అయితే ఈ పర్యటనకు వెళ్లాలా? వద్దా? అంటూ కలెక్టర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వె ళితే గంటా వర్గానికి, వెళ్లకపోతే అయ్యన్నవర్గానికి టార్గెట్ అయిపోతానంటూ కలెక్టర్ మదనపడుతున్నట్టు సమా చారం. మీటింగ్‌ల వంకతో ఈ ఒక్కసారి అయ్యన్న పర్యటనకు దూరంగా ఉండడమే మేలన్న భావనలో కలెక్టర్ ఉన్నట్టుగా తెలియవచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: