ఎన్నికల ముందు ఉన్నట్టుండి తెరపైకి వచ్చి చాలా హడావుడి చేసి.. తనలో కొత్త కోణాన్ని ప్రదర్శించి వెళ్లిన పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత మాత్రం మొహం చాటేశాడు. తన సినిమాలేవో తను చేసుకొంటూ కాలం గడుపుతున్నాడు. తెలుగుదేశం, బీజేపీ ఇచ్చిన హామీల అమలు తన బాధ్యత అని ప్రకటించి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆ హామీలను ఆ పార్టీ బుట్టదాఖలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

మధ్య లో ట్విటర్ ఖాతాను ప్రారంభించడం.. ఒకసారి చంద్రబాబును ప్రశంసించడం.. బీజేపీ పై నమ్మకం ఉందని హితవు పలకడం జరిగింది. మరి పవన్ ఏదో అప్పుడప్పుడు స్పందింస్తుండటం... ఎన్నికల ముందు కాలికి బలపం కట్టుకొని తిరిగిన ఆయన ఇప్పుడు ప్రజాసమస్యల గురించి ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం విమర్శల పాలవుతోంది.

అయితే ఆ విమర్శలు తనకు తగలవన్నట్టుగా పవన్ వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో తూళ్లూరు ప్రాంతం లో జనసేన జెండాలు పవన్ ను ఇరకాటంలో పడేశాయి. ఇన్ని రోజులూ పవన్ ఎందుకు పరామర్శించడానికి రావడం లేదు? అని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి.

అయితే ఇప్పుడు మాత్రం జనాలే స్పందిస్తున్నారు! పవన్ ప్రశ్నించడానికి రా.. అని వారు పిలుపునిస్తున్నారు. మరి రాజకీయపార్టీలు పవన్ పై విమర్శలనంటే పట్టించుకోకుండా ఉండొచ్చు కానీ.. ఇప్పుడు ప్రజలే పవన్ ను రారమ్మంటున్నారు. మరి వీటికి పవన్ ఏమని సమాధానం చెబుతాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: