కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా దూసుకుపోదామని అనుకొంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ దామోదర రాజనర్సింహను తెరపైకి తెచ్చింది. దళిత కోటాలో.. తెలంగాణకోటాలో ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పజెప్పింది. తద్వారా కిరణ్ కు కూడా కొంత చెక్ పెట్టింది. ముఖ్యమంత్రిగా కిరణ్ , ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ లు ఉన్న కాలంలో వారిద్దరూ టామ్ అండ్ జెర్రీలా వ్యవహరించారు.

మరి అప్పటి సంగతలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రం ఇద్దరూ కనపడకుండా పోయారు. కిరణ్ సొంతంగా పార్టీ పెట్టుకొని తగిలిన ఎదురుదెబ్బతో మీడియాకు ముఖం చాటేయగా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యి.. తెరమరుగు అయ్యాడు నాటి డిప్యూటీ సీఎం దామోదర!

సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యి ఏడెనిమిది నెలలు అయిపోయినా.. వీరిరువురి హడావుడి మాత్రం లేదు. కిరణ్ విషయంలో మొన్నటి వరకూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆయన బీజేపీలో చేరతాడనే వార్తలు వచ్చాయి. అయితే.. ఈ మధ్య వాటికి కూడా పుల్ స్టాప్ పడింది. కిరణ్ సంగతలా ఉంటే.. ఇప్పుడు దామోదరుడు మీడియా ముందుకు వచ్చాడు.

తమ పార్టీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటూ తెరాస వాళ్లపై... పోలీసులపై దామోదర విరుచుకుపడ్డాడు. తమ వారిని వేధిస్తున్న వారిని బట్టలూడదీసి కొడతామని దామోదర హెచ్చరించాడు. ఈ విధంగా తీవ్రమైన మాటలతో ఎన్నికల తర్వాత దామోదర మీడియా ముందుకు వచ్చాడు. మరి అసలే ప్రత్యర్థుల చేతిలో అధికారం ఉంది.. ఇలాంటి మాటలు మాట్లాడే విషయంలో దామోదర కొంచెం ఆలోచించుకొంటే మేలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: