మనం నిత్యజీవితంలో వాడే వంటింటి వస్తువుల్లో ఎన్నో రకాల ఔషదాలు ఉన్నాయి. పూర్వ కాలంలో మనిషి ఆయురారోగ్యాలతో ఉండేవాడు దానికి కారణం ఆ కాలంలో పోల్యూషన్ అనేదే తెలీదు. అంతే కాకుండా తన ఆహారపు అలవాట్లు, శ్రమతో కూడిన పనులు ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆయుష్షుతో బతికేవాళ్లు.

కానీ దీనికి పూర్తి విరుద్దంగా నేటి తరం ఉంది మనం బయటకు వెళితే చాలు పొల్యూషన్ పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్. మనం తినే ఆహారం నుంచి వాడే ప్రతి వస్తువులోనూ పొల్యూషన్ నిక్షిప్తమై ఉంటుంది. మనిషి అందంగా ఉన్నారు అంటే వారి రూపం, వొడ్డూ పొడవు రంగూ రూపు ముఖ్యంగా వారి కురులు దీన్ని బట్టి అందాని అంచనా వేస్తుంటారు. అమ్మాయిల అందానికి మరింత అందాన్ని చేర్చేవి కురువు. కురులకు వచ్చే సమస్యల్లో ప్రధానమైన చుండ్రు.

తలపై వచ్చే చుండ్రును అశ్రద్ధ చేస్తే అది అట్టగట్టినట్లు అయిపోయి పొలుసులుగా, పొక్కులుగా రాలుతూ, విపరీతమైన దురదను కలిగిస్తుంది. చుండ్రు వలన వెంట్రుకల కుదుళ్లు పటుత్వాన్ని కోల్పోయి పూర్తిగా ఊడిపోవడమూ జరుగుతుంది. దీనికి పరిష్కార మార్గాలు అనేకం ఉన్నా మనింట్లో దొరికే వస్తువులతో చుండ్రు నివారించుకోవచ్చు...

వంటింటిలో ఉన్న గసగసాలను కొద్దిగా తీసుకుని, వాటికి పాలు చేరుస్తూ నూరుకోవాలి. తర్వాత దానిని తలకు బాగా పట్టించి, ఆరిన తర్వాత తలంటు స్నానం చేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేశారంటే మూడు వారాల్లో చుండ్రు సమస్య పూర్తిగా సమసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: