ఈ ఆర్ధిక బడ్జెట్ లో వెనుకబడిన బీహార్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీకి రూ. కోటి, గిరిజన విశ్వ విద్యాలయానికి రూ.2 కోట్లు.ఏపీ నిట్ కు రూ.40 కోట్లు, ఐఐఎంకు రూ.40 కోట్లు.

ఐఐఎస్ సిఈఆర్ కి రూ.40 కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ.45 కోట్లు, ఐఐటికి రూ.40 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కు రూ.100 కోట్లు, విజయవాడ మెట్రో కు రూ.5.63 కోట్లు, విశాఖ మెట్రో కు రూ.5.63 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తానికి ఈ బడ్జెట్ లో మటుకు ఏపీ జాక్ పాట్ కొట్టినట్లయింది.

అలాగే, ఏపీ, జమ్మూకాశ్మీర్‌కు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), కర్ణాటకు ఐఐటీని నెలకొల్పుతామని ప్రకటించారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, తమిళనాడులో ఎయిమ్స్ ఆస్పత్రి, బీహార్‌లో ఎయిమ్స్ తరహాలో మరో సంస్థ నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యారంగానికి రూ. 68968 కోట్లు కేటాయించారు. 5 లక్షల గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు

. .

మరింత సమాచారం తెలుసుకోండి: