బౌలింగ్ తో కట్టడి చేశారు. బ్యాటింగ్ తో చిత్తు చేశారు. మొత్తానికి బారత్ వరల్డ్ కప్ లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పెర్త్ లో ఏకపక్షంగా సాగిన పోరులో టీమిండియా సునాయాసంగా 9 వికెట్ల తేడాతో పసికూన యూఏఈ పై ఆడుతూ పాడుతూ విజయాన్ని సాధించుకున్నారు.

103 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ధావన్ (14)పరుగులు తీసి వెనుతిరిగినప్పటికీ రోహిత్ శర్మ (57 నాటౌట్), విరాట్ కోహ్లీ (33 నాటౌట్)తో ఇండియాను విజయతీరాలకు చేర్చారు.

ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా తన దండయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా మూడోసారీ విజయబావుటా ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా ఉమేష్‌ యాదవ్‌ ,జడేజా చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్‌, మోహిత్‌ శర్మలు తలో వికెట్‌ తీసుకున్నారు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: