దంపతులు ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. లేదంటే నిద్ర లేమి తో నిరసం, విరక్తి, అసహనం, కోసం లాంటి భార్యా భర్తల మధ్య చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. మగవారు సిక్స్ ప్యాక్ వంటివి కాకుండా వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు ఎంతో మంచివని తెలుపుతున్నారు. రోజూ గంటపాటు ధ్యానం చేయడం వల్ల కూడా శక్తి పెరుగుతుందని అంటున్నారు.

భార్యాభర్తల మధ్య ఎటువంటి అనుమానాలు అపోహలకు తావు వుండకూడదు. ఇద్దరూ సెక్స్ గురించి మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. ఒకవేల భార్య ఈ విషయంలో సిగ్గు పడితే ఆమెను ప్రజర్ చేయకుండా నెమ్మదిగా ప్రేమతో దగ్గరకు తీసుకొని మనసు విప్పి మాట్లాడేలా చేసుకోవాలి అప్పుడే అందులో పూర్తి ఆనందాన్ని ఆస్వాదించగలరు.

ముఖ్యంగా పురుషులు, స్త్రీలలో వుండే రసికతనాన్ని పసిగట్టాలి. వారిలో సెక్స్ కోరికలు ఏ విధంగా వున్నాయో, ఎలా తృప్తి చెందుతారోనన్న విషయాలను గ్రహిస్తే.. అందుకు అనుగుణంగా వారిని తృప్తి పరచవచ్చు పురుషులు తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడమంటే.. తమ కండరాలను పెంచుకోవడమని కాదు! సరైన శృంగారం చేసుకోక పోతే సంతృప్తి చెందలేరు అలాగే స్త్రీని సంతృప్తి పరచలేరు. కొందరిలో ఈ లైంగిక శక్తి చాలా తక్కువగా వుంటుంది.

అటువంటి సెక్స్ పనికొస్తామో, లేదోనని ఆందోళనలో వుంటారు. అలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరైన మార్గాల ద్వారా లైంగిక శక్తి సామర్ధ్యాలు పెంచుకోగలిగితే భార్యా భర్తలు సంసారం సుఖవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: