డీజిల్‌, పెట్రోలు ధరలు ఫిబ్రవరి నెలలో రెండవ సారి భారీగా పెరిగాయి. అంత ర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు కూడా పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.3.18లు, డీజిల్‌ ధర లీటరుకు రూ.3.09లు పెరిగాయి. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారం వరకు రూ.57.31లుగా ఉన్న లీటరు పెట్రోలు ధర ఆదివారం నుంచి రూ.60.49 లుగా అయ్యింది. అదేవిధంగా డీజిల్‌ ధర రూ.46.62 నుంచి రూ.49.71లుగా అయ్యింది. ఈ మేరకు చమురు కంపెనీలు శనివారం ఒక ప్రకటనను విడు దల చేశాయి. .

పెట్రోలు ధరలు ఫిబ్రవరి నెలలో పెరగ డానికి ముందు 2014 ఆగస్టు నుంచి పది సార్లు తగ్గాయి. డీజిల్‌ ధరలు అక్టోబరు 2014 నుంచి ఆరు సార్లు తగ్గాయి. గత ఏడాది ఆగస్టు నుంచి పది సార్లు తగ్గిన లీటరు పెట్రోలు సంచిత ధర రూ.17.11లుగా ఉండగా అక్టోబరు నుంచి ఆరుసార్లు తగ్గిన లీటరు డీజిల్‌ సంచిత ధర రూ.12.96గా ఉంది. కాగా ఫిబ్రవరి 16 నుంచి ధరలు పెరగడంతో ఈ విధా నంలో మార్పు వచ్చింది.

''ఫిబ్రవరి 16నుంచి అమలు లోకి వచ్చిన ధరల మేరకు లీటరు పెట్రోలుపై రూ. 0.82లు పెరగగా, డీజిల్‌పై రూ.0.61లు పెరిగింది. (ఢిల్లీలో రాష్ట్ర లెవీతో సహా), ఆ తరువాత అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో శనివారం నాటి పెరుగుదల చోటు చేసుకుంది.'' అని ఐఓసీ పేర్కొంది

మరింత సమాచారం తెలుసుకోండి: