మహారాష్ట్ర తరహాలో కార్పొరేట్‌ కంపెనీలకు వ్యవసాయ భూము లను దత్తత ఇచ్చి వ్యవసాయం చేసే విధానాన్ని ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోనూ అమలు చేయను న్నట్లు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవ నశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లా రావు వెల్లడించారు. నూజివీడు సీడ్స్‌, మోనోశాంట్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీల ద్వారా తొలి విడత 2.75 లక్షల ఎకరాలలో దత్తత వ్యవసాయం చేయనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం కార్పొరేట్‌ కంపెనీలు రూ.400 కోట్లను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈతరహా వ్యవసాయం వల్ల తక్కువ ఖర్చుతో దిగుబడి పెరుగుతుందని చెప్పారు. విజయవాడలో శనివారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి పుల్లారావు విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్‌ దత్తత వ్యవసాయంపై ఈ ఏడాది మార్చిలో కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.

మహారాష్ట్రలో ఐదు లక్షల ఎకరాలను కార్పొరేట్‌ సంస్థలు దత్తత తీసుకుని వ్యవసాయం చేస్తున్నాయని, దీనివల్ల రైతులు అధిక దిగుబడులను సాధిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పత్తి, మొక్కజొన్న, మిర్చి, వరి పంటల సాగుకు కార్పొరేట్‌ కంపెనీలు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాయన్నారు.

మట్టి నమూనా పరీక్షలు, విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో వ్యవసాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎకరా విస్తీర్ణంలో పత్తి ఎనిమిది క్వింటాళళ్ల దిగుబడి వస్తోందన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్పొరేట్‌ దత్తత వ్యవసాయం చేయటం వల్ల ఎకరాకు 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చిందన్నారు. అందుకే ప్రభుత్వం కూడా కార్పొరేట్‌ దత్తత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: