చదువుల్లో డిగ్రీలు ఉన్నట్లే రాజకీయాల్లోనూ డిగ్రీలుంటాయి. రాజకీయ చదువుల్లో ఉన్న కోర్సులన్నింటిని ఔపాసన పట్టిన మేధావి నారా చంద్రబాబునాయుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు లాంటి వారినే బోల్తా కొట్టించాడు. అలాంటి చంద్రబాబుకు రాజకీయాలలో ఏపిబిసిడిలు కూడా సరిగ్గా నేర్చుకోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ఓ లెఖ్ఖా.

పవన్ కల్యాణ్ పరిస్థితి కూరలో కరివేపాకులాగా అయ్యింది. కేంద్రంల బీజేపీ, రాష్ర్టంలో టిడిపిలు మొన్నిటి ఎన్నికల్లో పవన్ ను దూకుడు సినిమాలో బ్రహ్మానందంను వాడుకున్నట్లు వాడుకున్నాయి. ఎన్నికలకు ముందే పవన్ జనసేన పార్టీని స్థాపించారు. కాని ఎన్నికల్లో పార్టీ తరపున ఎవరినీ పోటీకి పెట్టలేదు. మొదట కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు పలికారు. చంద్రబాబు ఆయనింటికెళ్లి మీ మద్దతు మాకు కూడా కావాలంటూ బ్రతిమలాడుకున్నాడు. దాంతో దిగొచ్చిన పవన్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ ప్రచారం ఆ ఎన్నికల్లో టిడిపికి బాగా ఉపయోగపడింది.

అయితే ఇప్పుడు రాష్ర్టంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమవుతుంది. రాజధాని పేరుతో పచ్చటి పొలాలను లాక్కుంటోంది. చంద్రబాబు సీఎం అయితే మీ బ్రతుకులు బాగుపడుతాయని పవన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు.

ఇప్పుడు బాగుపడడం మాట అటుంచి అంతంత మాత్రంగా వున్న బతుకులు కూడా నాశనమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఎన్నికలప్పుడేమో నేరుగా వచ్చి ఓట్లేయమని కోరి, ఇప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో స్పందించడమేంటని, ఆయన నేరుగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: