తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ స్థానంలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నాడని కన్ఫర్మ్ అయ్యింది. అయినా పొన్నాల ను తప్పించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు... పొన్నాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. పొన్నాలను తప్పించాల్సిందని అనేక మంది కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల ముందు నుంచినే ఈ డిమాండ్ ఉంది. అయితే అధిష్టానం మాత్రం ఆ డిమాండ్ ను పట్టించుకోనట్టుగా వ్యవహరించింది. అయితే అంతటితో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు విరమించుకోలేదు. పొన్నాలను తప్పించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకూ ఇప్పుడు పొన్నాలను తప్పించడం ఖాయం అయ్యింది.

మరి పొన్నాల సంగతి అలా ఉంటే.. జానా రెడ్డి పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పడు ఆసక్తి కరంగా మారింది. పొన్నాలను తప్పించాలనేది ఎంత తీవ్రమైనదో... జానాను తప్పించాలనే డిమాండ్ కూడా అంతే తీవ్రంగా ఉంది. అయితే జానాను తప్పించని అధిష్టానం పొన్నాలను మాత్రం తప్పించేసింది. మరి జానా కథేంటి? అంటే.. ప్రస్తుతానికి అయితే ఆయన సేఫేనట!

పొన్నాల పీసీసీ అధ్యక్షుడు.. ఆయనను తప్పించడానికి ఢిల్లీ నిర్ణయం చాలు. అయితే జానా రెడ్డి సీఎల్పీ లీడర్. ఈ పదవి లో ఉండే వ్యక్తిని కూడా సోనియాగాంధీనే నామినేట్ చేయగలదు కానీ... ఏదో నామినల్ గా అయినా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. కొత్త సీఎల్పీ అధ్యక్షుడి పదవికి ఎన్నిక నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అలా సీఎల్పీ ఎన్నికను నిర్వహించి.. జానాను తప్పించే అవకాశాలు తక్కువేనట. అందులోనూ జానారెడ్డి కాంగ్రెస్ కు అనుకూల సామాజిక వర్గం "రెడ్డి'' కావడంతో ఈయనకు ప్రస్తుతానికి భయం లేదని టాక్!

మరింత సమాచారం తెలుసుకోండి: