నన్నపనేని రాజకుమారి.. ఈ సీనియర్ పొలిటీషియన్ ప్రెస్ మీట్లలో కంటెంట్ తో కంటే.. కంటినీటితోనే ఎక్కువగా వార్తల్లోకెక్కుతారు. సెన్సిటివ్ గా కనిపించే ఈ నన్నపనేని రాజకుమారికి నీళ్లకుండ నెత్తిమీదే ఉంటుందని పేరుంది. ప్రత్యేకంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఏ సెలబ్రెటీల కన్నుమూసినా తప్పకుండా హాజరై... తన వంతుగా రెండు కన్నీటి బొట్లు రాల్చి శ్రద్ధాంజలి ఘటించడం నన్నపనేనికి అలవాటు.

అలాంటి నన్నపనేని ఆదివారం మరోసారి కంట తడిపెట్టుకున్నారు. కాకపోతే ఈ సారి ఏ సెలబ్రెటీకి ఏమీ కాలేదు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయంమే అందుకు కారణం.. కేంద్రం రాష్ట్రం రెక్కలు విరిచి ఎగరమంటోందని శనివారం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన తీరు నన్నపనేనితో కంటతడి పెట్టించింది. బీజేపీ రాష్ట్రం గొంతు కోసిందన్న నన్నపనేని.. తీవ్రస్థాయిలో ఆ పార్టీ వైఖరిపై విరుచుకుపడ్డారు.

కేంద్రం వైఖరి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని నన్నపనేని హెచ్చరించారు. చేతకాని వారికింద.. చేవలేని వారికింద తమను భావించవద్దనని హెచ్చరించారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ని ఒంటరిని చేయాలని చూస్తే.. తెలుగు ప్రజల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురవుతుందని రాజకుమారి వార్నింగ్ ఇచ్చారు. యూపీఏ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు మద్దతు పలికిన బీజేపీ.. ఇప్పడు ఏపీకి సాయం చేసేందుకు ఎందుకు ముందుకురావడం లేదని నిలదీశారు.

నన్నపనేని కేంద్ర సాయం విషయంలో మరో కొత్త కోణం బయటపెట్టారు. తెలంగాణ సీం కేసీఆర్ కు భయపడే.. కేంద్రం ఆంధ్రాకు సాయం చేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రాకు న్యాయం చేస్తారా.. చేయరా అన్న విషయం తేల్చిచెప్పాలని నన్నపనేని డిమాండ్ చేశారు. ఎన్నాళ్లిలా తెలుగు ప్రజలతో ఆడుకుంటారన్న నన్నపనేని.. పెద్దన్నలా వ్యవహరించాల్సిన మోడీ.. తెలుగు ప్రజల మనోవేదన అర్థం చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: