తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి నెలకొనడంతో ఈ రెండు ప్రాంతాల్లోనూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఒక మాదిరి వర్షం కురిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.

హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశం మేఘావృత్తమై అక్కడక్కడ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వర్షం, విపరీతమైన పొగమంచు కారణంగా నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది.

వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం హెలికాప్టర్ ప్రయాణానికి ఏటీసీ అనుమతించలేదు. దీంతో సీఎం కేసీఆర్ పర్యటన రద్దు చేసుకోక తప్పలేదు. కాగా, హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.

నిజామాబాద్ లో శనివారం మొదలైన ముసురు, వర్షానికి తోడు ఈదురు గాలులు వీచాయి. 2 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో బాన్స్ వాడ, కామారెడ్డి, బాల్కొండ,బోధన్ లో చిరుజల్లులు కురిశాయి. పలు చేట్ల పసుపు, ఎర్రజొన్న, పొద్దు తిరుగుడు పంటలకు నష్టం వాటిల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: