రాష్ట్ర కాంగ్రెస్ లో భారీ మార్పులకు హైకమాండ్ రెడీ అవుతోంది. మార్పుల్ని పీసీసీ చీఫ్ తోనే..మొదలెట్టాలని డిసైడ్ చేసినట్టు టాక్. మార్పులు చేర్పులపై ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర నేతలు చక్కర్లు కొడుతున్నారు. పీసీసీ చేఇఫ్ పదవి నుంచి పొన్నాలను తప్పించడం ఖాయమన్న సిగ్నల్స్ వస్తున్నాయి. రేపో మాపో హైకమాండ్ పొన్నాలకు తిలోదకాలు ఇచ్చే చాన్స్ ఉంది. పొన్నాలపై మొదటి నుంచే హైకమాండ్ గుర్రుగా ఉంది. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పొన్నాలపై ఢిల్లీ నేతల గుస్సా ఎక్కువైంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తెల్లారి నుంచే ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీని బలోపేతం చేయడం కంటే సీటును పదిలంగా కాపాడుకోవాడానికి పొన్నాల కష్టపడుతున్నారు. పార్టీని పొన్నాల హ్యాండిల్ చేయలేరన్న కన్ క్లూజన్ కు హైకమాండ్ వచ్చినట్టు తెలుస్తోంది. రెడ్డి ఈక్వేషన్స్ తో పీసీసీ చీఫ్ పోస్ట్ ను భర్తీ చేసేందుకు స్కెచ్ గీసినట్టు టాక్.

రెడ్డి సామాజికవర్గం అనాదిగా కాంగ్రెస్ వెంటే ఉంది. కాంగ్రెస్ MLAలలో డజన్ మంది రెడ్డి వర్గం ఎమ్మెల్యేలున్నారు. రాష్ట్రంలో వెలమ, రెడ్డి సామాజిక వర్గాలు రాజకీయంగా బలంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ను వెలమ వర్గం లీడ్ చేస్తున్నా గత ఎన్నికల్లో రెడ్డి వర్గానికి ఫ్రాధాన్యతనిచ్చింది. కేసీఆర్ కేబినెట్ లోనూ వీళ్లదే లయన్ షేర్. కాంగ్రెస్ కు మళ్లీ మంచి రోజులు రావాలంటే రెడ్డి లీడర్ షిప్ కావాలంటున్నారు రాష్ట్ర నేతలు.

పీసీసీ చీఫ్ రేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందున్నారు. సినియారిటీ, నాలుగు సార్లు MLAగా గెలిచిన అనుభవం ఉత్తమ్ కు ప్లస్ పాయింట్. టీఆర్ఎస్ హవాలోనూ ఉత్తమ్ హుజుర్ నగర్ నుంచి బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. సేమ్ టైమ్ ఉత్తమ్ భార్య పద్మావతి కోదాడ నుంచి గెలిచారు. గాంధీ ఫ్యామిలీతో ఉత్తమ్ అటాచ్ మెంట్ డబుల్ ప్లస్ కానుందని సమాచారం. సీఎల్పీ లీడర్ గా జానారెడ్డిని మారుస్తారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలోనే మకాం పెట్టిన జానా హైకమాండ్ తో డిస్కషన్ లో ఉన్నారు. టీఆర్ఎస్ పై దూకుడుగా లేరని జానాపై మెయిన్ కంప్లైంట్. విపక్ష నేతగా సర్కార్ పై మెత్తగా వ్యవహరిస్తున్నారని హైకమాండ్ నారాజ్ గా ఉందని టాక్. బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎల్పీని మార్చే ప్రయత్నాలు చేయకపోవచ్చని సమాచారం. ఈసారి క్లాస్ తో హైకమాండ్ జానాను వదిలిపెట్టే అవకాశముందంటున్నారు ఎక్స్ పర్ట్స్.

పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ లైన్ లోకి కొస్తే ఈక్వేషన్స్ పరేషాన్ చేసే చాన్స్ లేకపోలేదు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్, సీఎల్పీ నేతగా జనారెడ్డి ఇద్దరూ రెడ్డి సామాజికవర్గమే. ఇద్దరు నేతలది నల్గొండ జిల్లానే. అంతేకాదు ఇద్దరిది ఒకే పార్లమెంటరీ నియోజకవర్గం. రెండు కీలక పదవుల్ని ఒకే జిల్లా నేతలతో ఎలా రన్ చేస్తారని మరికొందరి డౌట్స్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కోసం మరో నేతను చూడాల్సిన సిచ్యువేషన్. ఈ పోస్ట్ కోసం ఇద్దరి ముగ్గురి నేతలపై హైకమాండ్ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈక్వేషన్స్ ఎలా ఉన్నా పీసీసీ చీఫ్ ను తప్పించడం ఖాయమని తేలిపోయింది. పొన్నాలకు గుడ్ బై చెప్పడమే లేటంటున్నారు. ఎప్పుడనేదే…మరో డైలామా.

మరింత సమాచారం తెలుసుకోండి: