అవునా అంటే నిజమే అంటున్నారు పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు.. సమాజంలో జరుగుతున్న అన్యాయలను, అక్రమాలను ప్రశ్నిండచానికి వస్తున్నా అంటూ పవన్ ఆమధ్య ‘జనసేన’ అనే పార్టీని స్థాపించాడు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడం అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని స్కామ్ లు చేసి ఉంటడం ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రం ఇచ్చేయడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు.

తెలుగు రాష్ట్రాన్ని రెండు గా చేసిన పాపం కాంగ్రెస్ కే దక్కిందని ఆరోపణ చేస్తూ ‘కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో’ అనే నినాదంతో పవన్ బిజెపి, టీడీపీకి మద్దతు ఇచ్చాడు. అంతేనా వాటి గెలుపు కోసం తెగ కష్ట పడ్డాడు మొత్తానికి గెలిపించాడు.

విషయానికి వస్తే..మొన్న జరిగిన బడ్జెట్ కేటాయింపులు ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కానీ మిగతా విషయాల్లో కూడా కేంద్రం నుండి సరైన స్పందన లేకపోవడంతో ఖంగుతిన్న బాబు పవన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు .

ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు పవన్ తో చెప్పినట్లు రాష్ట అభివద్ది కి కావాల్సిన బడ్జెట్ విషయాల గురించి వివరించారు అన్ని విషయాలు సావ ధానంగా విన్న పవన్ తాను కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్వరలోనే ఢిల్లీ వెళ్లి మోడీని రాష్ట్రానికి జరిగిన అన్యాంపై ప్రశ్నిస్తాడనే అందరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: