దేశంలోని పొలిటికల్ లీడర్లు నిరాహార దీక్షలు నిర్వహించడం కొత్త కాదు. ప్రతిపక్షంలో కూర్చొన్నారంటే...దీక్షలూ ధర్నాలకు లోటుండదు. ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహించడం, కొన్ని గంటల సేపు దీక్షలు నిర్వహించడం చాలా సహజంగా జరిగేదే! అయితే... ఆవిర్భావం దగ్గర నుంచి ఇలాంటి పనులను పెట్టుకోలేదు లోక్ సత్తా పార్టీ!

అభివృద్ధి విషయంలో... ప్రజా సంక్షేమ విషయంలో నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం.. మేధో తనంతో మాట్లాడటం వంటి పనులను చేసింది లోక్ సత్తా పార్టీ. ఆ పార్టీ అధినేత కూడా వ్యవస్థలో మార్పు రావాలని పదే పదే చెబుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్య మున్న ఈ పార్టీ చరిత్రను బట్టి చూస్తే గట్టిగా ధర్నాలు నిర్వహించింది కానీ.. దీక్షలు చేసింది కానీ లేదనుకోవాలి.

మరి గతం సంగతలా ఉంటే.. ఇప్పుడు జేపీ స్వయంగా నిరాహార దీక్షకు సిద్ధం అయ్యాడు. ఈయన ఒక వేదికపై గాక.. పలు వేదికలపై నిరాహార దీక్ష నిర్వహిస్తాడట. అనంతపురం, విశాఖ పట్టణం, విజయవాడల కేంద్రం జేపీ నిరాహార దీక్షలు ఉంటాయట. ఒక్కో ఊర్లో ఒక్కో రోజు చొప్పన జేపీ నిరాహార దీక్షలు చేయనున్నట్టుగా తెలుస్తోంది.

మరి జేపీ ప్రస్థానాన్ని బట్టి చూస్తే.. ఇలాంటి నిరాహార దీక్ష కొత్త అనుకోవాలి. బహుశా అందరూ చేస్తున్నారు.. ఇలాంటి వాటితో జనాల్లో పార్టీకి అంతో ఇంతో గుర్తింపు వస్తుంది. అనే వ్యూహంతో జేపీ ఇలా ముందుకు వెళ్తున్నారేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: