చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మధుమేహ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ జబ్బు రాగానే పలు రకాల ఆంక్షలు ఆహారం విషయంలో వస్తాయి. అయితే వాటిలో వైద్యులు పెట్టే ఆంక్షలు తక్కువ, ఇరుగు పొరుగు చెప్పినవి విని అనుసరించేవి ఎక్కువగా ఉంటాయి. షుగర్ జబ్బు వచ్చినంత మాత్రాన కాయగూర విషయంలో ఆంక్షలు అనవసరం.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోస, వంకాయ, కాకర, బెండ, టొమోటో, ముల్లంగి, మిరప వంటివి ఏవీ మానక్కరలేదు. వీటిలో ఉండే పిండి పదార్థాలు చాలా తక్కువ. అయితే ఏ వంటకాన్ని అతిగా తినకూడదు. మితంగా ఏదైనా తినవచ్చు. బాగా ఉడికించక తక్కువగా ఉడికించినవి లేదా పచ్చివి తినగలిగితే బాగుంటుంది.

ముఖ్యంగా కొన్ని రకాల కాయగూరలు షుగర్ జబ్బు వారికి చాలా మేలు చేస్తాయి. వాటిలో మొదటి స్థానంలో వచ్చేది కాకరకాయ. కాకరను ఇన్సులిన్ కాయ అని కూడా అంటారు. ఇందులో ఇన్సులిన్ లక్షణాలు కలిగిన జీవరసాయనం ఉంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారి కాకర తింటే రక్త, మూత్ర చక్కెరల్లో షుగర్ స్థాయి తగ్గుతుంది. కాకరను షుగర్ జబ్బు ఉన్నవారు తరచుగా తినవచ్చు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: