రాహుల్ గాంధీ.. రాజకీయాలనుంచి హటాత్ గా సెలవు తీసుకోవడం.. ఆయన ఆసహనానికి.. అగమ్యగోచర స్థితికి అద్దం పడుతోంది. మొదటి నుంచీ రాజకీయాల పట్ల వైముఖ్యం ఇందుకు ప్రధాన కారణం. రాహుల్ గాంధీకి.... సోనియాగాంధీకి... రాహుల్ గాంధీ తండ్రి... రాజీవ్ గాంధీకి.. రాజకీయాలంటే.. మొదటి నుంచి ఆసక్తి లేకపోవడం..గమనార్హం.. కేవలం రాజకీయవారసత్వమే.. వారిని రాజకీయాలవైపు నడిపించింది. ఇందిరాగాంధీ.. ఎమర్జెన్సీ సమయంలోనూ...తర్వాత ఎదుర్కొన్న అవమానాలు గమనించినా.. రాజకీయాల్లోకి రాని.. రాజీవ్ గాంధీ.. తన సోదరుడు సంజయ్ గాంధీ.. హటాన్మరణం..తర్వాత తల్లికి అండగా.. అనాసక్తితోనే.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1984లో ఇందిరాగాంధీ దారుణ హత్య నేపథ్యంలో అనూహ్యంగా ప్రధాని పగ్గాలు చేపట్టారు..

1991లో రాజీవ్ గాంధీ.. దారుణ హత్యకు గురైనా.. సోనియాగాంధీ.. రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు.. అందుకే పీవీ నర్సింహారావు ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు.. 90 వ దశకంలో కాంగ్రెస్ పతనావస్థకు చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల బలవంతంమీదే..సోనియాగాంధీ.. పార్టీ పగ్గాలు చేపట్టారు.. ఎంపీగా.. ఎన్నికైనా.. పదవులకు దూరంగానే ఉండిపోయారు. చిన్నప్పుడే... నాన్నమ్మ.. ఇందిరాగాంధీ.. తర్వాత తండ్రి రాజీవ్ గాంధీ.. దుర్మరణం... సెక్యూరిటీ సమస్యల వల్ల ఇంట్లోనో.. లండన్ లోనో ...చదువు సాగించాల్సిన పరిస్థితి... రాహుల్ గాంధీకి చిన్నప్పటినుంచీ రాజకీయాలంటే.. అయిష్టత పెంచి ఉండవచ్చు. తల్లికి కూడా రాజకీయాలపట్ల ఆసక్తి లేకపోవడం.. అందుకు మరింత దోహదపడి ఉండవచ్చు.

వారసత్వ రాజకీయాలు చేపడితే తప్ప... తమ కుటుంబానికి దేశంలో ఉనికి ఉండదన్న పరిస్థితుల్లోనే 2004లో రాహుల్ రాజకీయ అరంగేట్రం చేశారు. తొలి అడుగే.. ఎంపీ.. ఎన్నికల్లో పెట్టాడు.. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా.. కేంద్రమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా.. దూసుకు వెళ్లే యత్నం చేయలేదు.

కార్యకర్తలతో పరిచయం... వారితో మమైకం కావడం లాంటివి లేకుండానే.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ.. వైస్ ప్రెసిడెంట్ .. వంటి పదవులు అయాచితంగా రాహుల్ ను వరించాయి... ఆ స్థితిలో పార్టీ... అటు సార్వత్రిక ఎన్నికలనుంచి.. ఇటు పలు రాష్ట్రాల్లో పరాజయం పాలు కావడం.. పార్టీని నిలబెట్టేందుకు తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.. నిరాశ, నిస్పృహ... రాహుల్ ఈ నిర్ణయం తీసుకునేందుకు తోడ్పడి ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: