ప్రధాని మోడీ ఎన్నికల ముందు తిరుపతిలో ఎపి రాజధానికి సంబందించి బ్రహ్మండమైన ప్రకటన చేసినా కేంద్ర ఆర్దిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో రాజధాని ప్రస్తావనే లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు వ్యాఖ్యానించారు.

గత ప్రధాని మన్మోహన్ సింగ్ ఎపి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారని, కాని ఇప్పుడు దానిని కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు.విభజన బిల్లు సమయంలో మరింత న్యాయం చేస్తామని చెప్పిన ఇప్పటి అదికార పార్టీ ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదని అన్నారు

.విబజన బిల్లు సమయంలో తాను తీవ్రంగా వ్యతిరేకించానని, ఆ సమయంలో అనారోగ్యానికి గురి అయ్యానని ఆయన అన్నారు.లోక్ సభలో ఎపి కౌన్సిల్ విస్తరణ చేస్తామని బిల్లు పెట్టారని,కాని దానిని ఎవరూ అడగడం లేదని

ఎపి ప్రజలు కోరుకుంటున్నది ప్రత్యేక హోదా, ఇతర అబివృద్ది కార్యక్రమాలు అని కెవిపి వ్యాఖ్యానించారు.పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణకు నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఇస్తామన్నా ఇంతవరకు చర్య తీసుకోలేదని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: