సినిమారంగంలో నందమూరి వారి ఇమేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా అటు బాబాయి, ఇటు అబ్బాయిలు తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫోలోయింగ్ తో సాగిపోతున్నారు. బాబాయి ఓ అడుగు ముందుకేసి రాజకీయ రంగంలో దూసుకు పోతున్నాడు.

ఇందూ పురం నుంచి ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఎన్నికైనప్పటి నుంచి చాలా చురుకుగా రాజకీయాల్లో పొల్గొంటున్నాడు. రాజకీయ రంగంలోకి రావడం ప్రజా సేవ చేయడం తన తండ్రి ఇచ్చిన స్పూర్తి అంటాడు. మరి హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణకి కోపమొచ్చేసింది. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందంటూ బాలకృష్ణ మండిపడ్డారు.

తమపై ఎంతో నమ్మకంతో తామకు ఏదో చేస్తారని నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలకు అన్యాయం జరిగితే తిరగబడ్తారు. న్యాయమే కదా చెయ్యమంటున్నాం. అన్యాయం చేస్తామంటే సహించేది ఎలా.? అంటూ చిర్రెత్తి పోయారు. మొన్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి వరిగింది ఏమీ లేదని అందులోనూ పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు ముష్టి వేసి, ప్రాజెక్టు కట్టేసుకోమంటే అదెలా కుదురుతుందని ప్రశ్నించారు.

తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బ తీయాలని చూడొద్దు.. ప్రజలు తిరగబడ్తారు.. ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేం..’ అని బీజేపీకి హెచ్చరించిన బాలకృష్ణ, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలోపెట్టుకుని ఇకైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేసే దిశగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాపై వేరే రాష్ట్రాలకు లేని అభ్యంతరం ఆంధ్రప్రదేశ్‌కే ఎందుకు వస్తుందని బాలకృష్ణ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: