మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకంతో వచ్చిన ఉత్సాహం ఇది. ఇన్ని రోజులూ ఈ పదవిలో ఉండిన పొన్నాల ను పక్కన పెట్టి అధిష్టానం ఉత్తమ్ ను ఆ పదవిలో నియమించింది. ఇప్పుడు ఆయన చాలా సంబరపడుతున్నాడు. ఆయన అనుచరులు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు.

పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించాడు. రాహుల్ గాంధీ ఆదేశాలను పాటిస్తానని.. సోనియాగాంధీ ఆదేశాలను బట్టి నడుచుకొంటానని.. పార్టీ కార్యకర్తల మనోభావాలకు ప్రాధాన్యతను ఇస్తానని.. ఓవరాల్ గా పార్టీ ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానని తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ప్రకటించాడు.

మరి ఈ మాత్రం ఉత్సాహం కూడా కాంగ్రెస్ లో ఈ మధ్య కూడా కనిపించింది లేదు. ఉత్తమ్ నియామకంతో ఈ ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ ఉత్సాహం ఎన్ని రోజులు? అనేది మాత్రం సందేహాస్పదమైన విషయమే. తెలంగాణలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం బాగోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశామని ప్రకటించుకొన్నా.. ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత కూడా కోలుకొన్నదాఖలాలు ఏమీ లేవు.

సరైన నేత లేకపోవడం... ఉన్న వారిలో ఐక్యమత్యం లేకపోవడం వంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన మైనస్ పాయింట్లు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉత్తమ్ తో కొంత ఉత్సాహం వచ్చినట్టుగా ఉంది. ఇది ఎన్నిరోజులో..!

మరింత సమాచారం తెలుసుకోండి: