దేశ రాజధానిలో అర్థరాత్రి సమయంలో ఒక యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హాంసించిన సంఘటన అందరికీ గుర్తుంది కదా..! ఈ సంఘటనతో యావత్ భారత దేశంలో యువతులు, మహిళలు మేల్కొన్నారు ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం నిలపాలని గట్టిగా అరిచారు. దీంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘నిర్భయ’ చట్టాన్ని తీసుకు వచ్చింది. అయితే నిర్భయ కేసు నిందితులకు శిక్ష ఖరారు కావడం జరిగింది.

నిర్భయ కేసు నిందితుడు ముఖేష్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆడాళ్లు రేప్‌లు చేస్తే చేయించుకోవాలని నిర్భయ కేసు నిందితుడు ముఖేష్ సింగ్ అంటున్నాడు. అసలు వాళ్ళకు అర్థరాత్రి పూట ఏం పని ఉంటుంది. ఎందుకు అర్థరాత్రి పూట తిరగాలి ఇంట్లో వారికి వీరు ఎం చెప్పి బయటకు వస్తున్నారు. అర్థరాత్రి అయ్యాకు కూడా మగాళ్లతో బయట తిరగడం ఏంటీ అని ఈ ముద్దాయి ప్రశ్నిస్తున్నాడు. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో తాను చేసిన దుర్మార్గంపై పశ్చాత్తాపం లేకుండా మాట్లాడాడు.

ఆ వివరాలను పరిశీలిస్తే... ముఖ్యంగా అత్యాచార విషయాల్లో మగాళ్లనే తప్పుపడుతుంటారు. ఆడవాళ్లకు కూడా అందులో భాగం ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నాడు. కేవలం ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని సూత్రీకరించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు పబ్బులు, డిస్కోలకు విచ్చల విడిగా తిరిగితే పర్లేదా? అర్థ నగ్నంగా డ్రెస్సులు వేసకుంటే ఏ మగాడైనా చూస్తూ ఊరుకుంటాడా ? అని ప్రశ్నించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానమైనప్పుడు ఉరిశిక్ష ఎందుకని అడిగాడు.

అలా ఉరిశిక్షలు విధిస్తే బాధిత మహిళలకు ప్రాణహాని ఉంటుందని హెచ్చరించాడు. నిర్భయను బలాత్కరిస్తున్నప్పుడు ఆమె మౌనంగా ఉందని, ఎలాంటి ప్రతిఘటనా చేయలేదని అన్నాడు. ఆమెను తామేమీ అనలేదని, ఆమె స్నేహితుడ్ని మాత్రం చితకబాదామని తెలిపారు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు తాను బస్సు నడుపుతున్నానని ముఖేష్ సింగ్ వివరించాడు. ఆడ వాళ్లు గౌరవంగా ఇంట్లో ఉంటే ఏవరికీ వారిని ఏం చేయాలనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి: