ఆరోగ్యమే మహాభాగ్యం మనిషి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఎంత డబ్బు కలిగి ఉన్నా అతడు సంపూర్ణ ఆరోగ్య వంతుడైతేనే సంతృప్తిగా జీవిస్తాడు. అవన్నీ ఉండి కూడా అనారోగ్యం పాలైతే జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు. ఆరోగ్యంగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యముగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళల్లో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లోని వాళ్లే! 35 మిలియన్లకి పైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారినపడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా. 30 శాతం మంది ప్రి-డయాబెటిక్‌ స్టేజ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో 40కి పైబడ్డ ప్రతీ ఇద్దరిలో ఒకరికి మధుమేహం పీడిస్తుండి. డయాబెటిస్‌ అనే వ్యాధి కాదు, కాని అనేక వ్యాధులకు మూలం. ఇలా విస్తృతంగా పెరిగిపోతున్న డయాబెటిస్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. ఫెడరిక్‌ బ్యాంటింగ్‌, చార్లస్‌ వెస్ట్‌తో కలిసి 1922లో ఇన్సులిన్‌ని కనుక్కున్నారు.

దీనికి నివారణ చర్యలు ..! పప్పు దినుసుల నుండి లభించే ప్రొటీన్లు, మాంసాహారం నుండి లభించే ప్రొటీన్లు కంటే మేలైనవి. ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆహారం ప్రొటీన్ల శాతాన్ని పెంచుతుంది. పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయినప్పటికీ కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు మధుమేహాన్ని నివారించటం లోనూ, రక్తంలో కొవ్వు పదార్థాలను తగ్గించ డంలోనూ ఉపయోగపడతాయి. ఆకు కూరలు, కూర గాయల్లో పీచు అధికంగా ఉంటుంది. మెంతుల్లో పీచు పదార్థాం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని, చికిత్సను సహాయకారిగా తీసుకోవచ్చు. మీ పాదాలకి సౌకర్యంగా ఉండే అనువైన పాదరక్షలను వాడాలి.

డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం, దీనిలో అతి ముఖ్యమైన అంశం ఆహార నియమం. రోగి గాని రోగి యొక్క కుటుంబంలోని వారుగాని అలవాటుగా తినే ఆహారాన్ని కొన్ని నియమాలతో తీసుకోవాలి. సమయం ప్రకారమే ఆహారాన్ని తీసుకోవాలి. ధూమపానం అలవాటు పూర్తిగా మానేయాలి. ఎక్కువ కొలస్ట్రాల్‌ ఉండే నూనెలు గాని, మాంసా హారాలు గాని, నూనే అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం పూర్తిగా తగ్గించాలి.రోజు తగినం తగా వ్యాయామం చేస్తూ ఉండాలి. తక్కువగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నడుస్తూ ఉండాలి. మీ రక్తపోటు, శరీర బరువు, నడుము చుట్టుకోలత - ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోగలం.

మరింత సమాచారం తెలుసుకోండి: