మొన్న జరిగిన బడ్జెట్ కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని రాజకీయన నాయకులు, విశ్లేషకులు అంటున్నారు. కొత్తగా విడిపోయిన రాష్ట్రాలను సాదరంగా ఆదరించాల్సింది పోయి తీరని అన్యాయం చేశారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరగలేదని విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశం, వైసిపి, జనసేన, పార్టీలు మూకుమ్మడిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన తీవ్ర రంగ విమర్శలు గుప్పిస్తున్నాయి.

బడ్జెట్ కేటాయింపులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోగా పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం జరిగిందని దీని అభివృద్ది కోసం కేంద్రం ఎంతైనా ఆలోచించాల్సిన విషయం ఉందని లోటు బడ్జెట్ తో రాజధాని ఎలా నిర్మించుకోవాల్సి ఉందని ప్రభుత్వ కార్యాలయాలు కూడా లేవని ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ వంటి మహ నగరాన్ని తాము కోల్పోయినప్పుడు తమకు కేంద్రం ఎంతగా అండగా ఉండాలని నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారు. ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవనున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి పవన్ విస్తృత ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రధాని మోడీని ప్రశ్నించేందుకు ఆయననే బయటకు రావడంతో బీజేపీ నేతలు కాస్త సర్దుబాటు చేసకుంటున్నారు బడ్జెట్ పైన వివరణ ఇచ్చుకున్నారు.

ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని దీనిపై తాము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడుతామని చెప్పారు. ఇక సోమవారం బాలకృష్ణ ఒక అడుగు ముందుకేసి బీజేపీని ఎండగట్టారు. చంద్రబాబు, పవన్, బాలయ్య ఢిల్లీ వెళ్లి ఏపీకి న్యాయం చేయాలని కోరనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: