ఎమ్మార్పీఎస్‌ హెచ్చరికలు, పోలీస్‌ భద్రత నడుమ టీడీపీఅధినేత చంద్రబాబునాయుడి కరీంనగర్‌ పర్య టన విజయవంతమైంది. స్వల్ప ఘటనలు మినహా తెలంగాణలో బాబు రెండో టూర్‌ విజయవంతమయింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశించినస్థాయికి మించి బాబు పర్యటనను సక్సెస్‌ చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంగళవారం ఉద యమే ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను, ఆయన అను చరులను పోలీసులు గృహనిర్భందం చేశారు. దీంతో చంద్రబాబు పర్య టన ఆధ్యంతం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా జరిగింది. అయితే స్థానిక అంబేద్కర్‌ గ్రౌండ్స్‌లో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమ యంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలనుంచి తీవ్రప్రతిఘటన ఎదురైంది. సభ మధ్యలో అక్కడక్కడా కూర్చున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు వర్గీక రణ కోరుతూ నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

టీడీపీ కార్య కర్తలు ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై దాడికి ప్రయ త్నించారు. పోలీసులు అప్రమత్తమై ఆందోళన కారులను అదుపులోకి తీసుకోవడంతో తిరిగి బాబు ప్రసంగం ప్రశాంతంగా కొనసాగింది. తెలంగాణలో పార్టీపునర్‌వైభంతోపాటు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వా సం నింపే దిశలో చేస్తున్న చంద్రబాబు తెలంగాణ జిల్లాల పర్యటనలు వరుసగా విజయవంతం అవుతున్నాయి. కార్యకర్తలు, ప్రజలనుంచి ఎదురవుతన్న నీరాజనాలతో ఆయన మూడో జిల్లా యాత్రకు కూడా సిద్దముతున్నట్లుగా కరీంగనర్‌ పర్యటనలో చంద్రబాబు మాటలు స్పష్టం చేశాయి. కార్యకర్తలు తన కుటుంబసభ్యులకంటే ఎక్కువని, వారి త్యాగం జీవితాంతం మరువలేనని చేస్తున్న చంద్రబాబు ప్రసం గాలు కార్యక్తల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.

మొదట ఓరుగల్లు జిల్లా పర్యటనతో తెలంగాణ జిల్లాల్లో టూర్‌కు చంద్రబాబు శ్రీకారం చుట్టినసంగతి తెలిసిందే. వరంగల్‌ పర్యటనకు కూడా టీఆర్‌ఎస్‌, ఎమ్మార్పీఎస్‌లనుంచి ప్రతికూలత ఎదురైనప్పటికీ చంద్రబాబు పర్యటన ఊహించని స్థాయిలో విజయవంతంమైంది. అదే ఊపు తో మంగళవారం కరీంనగర్‌కు బయలుదేరిన పార్టీ అధినేతకు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మధ్యాహ్మం హైదరాబాద్‌నుంచి నేరుగా హెలీకాఫ్టర్‌లో కరీం నగర్‌ జిల్లా వరంగల్‌కు చేరుకున్న చంద్రబాబుకు హెలీ పాడ్‌నుంచి సమావేశం జరిగిన అంబేద్కర్‌ స్టేడియం వరకు అడు గడుగునా సాదర స్వాగతం లభించింది. హెలీకాఫ్టర్‌లో చంద్ర బాబునాయుడితో పాటు టీటీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌కు మధ్యాహ్నం 1.30 సమయంలో చేరుకున్నారు. అక్కడినుంచి ర్యాలీగా ఎల్‌ఎండీ కాలనీ గుండా అల్గ నూర్‌కు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసినివాళ్లర్పించారు. అనంతరం భారీ వాహన కాన్వాయ్‌తో కరీం నగర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ స్టేడియానికి చేరుకుని కార్యకర్తల సమా వేశంలో ప్రసంగించారు. కాగా చంద్రబాబునాయుడు కరీంనగర్‌కు చేరిననుంచి రహదారివెంట ప్రజలనుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఎమ్మార్పీఎస్‌ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలను తీసుకున్నారు. ఆయన పర్యటనలో ఎటెవంటి ఆటంకాలు ఎదురు కాకుండా ముందుకు సాగింది. కార్యకర్తలను ఉత్తేజితం చేయడంతోపాటు, నేతల్లో తానున్నా నంటూ ధైర్యం నింపే రీతిలో బాబు ప్రసంగం కొనసాగింది. చంద్రబా బు పర్యటిస్తున్న సమయంలో కార్యకర్తలు,పార్టీ నేతలనుంచి మంచి స్పందన వ్యక్తమైంది. 10 మాసాల తర్వాత తన కుటుంబసభ్యులను కలిసినంత ఆనందంగా ఉందని పలుమార్లు చంద్రబాబు వ్యాఖ్యానిం చి కార్యకర్తలపట్ల తనప్రేమను చాటారు. కార్యక్తల కోసం జీవితాంతం రుణపడి ఉంటానని, వారిసంక్షేమానికి చేపట్టిన చర్యలను వివరించి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారు. తెలంగాణలో రానున్న 2019లో తిరుగులేని శక్తిగా ఎదిగి అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చి తాను త్వరలో మూడో పర్యటనకు వస్తానని తెలంగాణ ప్రజలకు చెప్పారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచే యాలని, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడంద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం విజయవంత మైంది. మరోవైపు తెలంగాణకు వ్యతిరే కంగా తాను ఏనాడు మాట్లా డలేదని, వెనుక బడిన ప్రాంతంగా ఉన్నతెలంగాణ అభివృద్ధి చెందడం తనకు ఆనందంగా ఉందని చెబుతూ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇటీవలే నాగార్జున సాగర్‌ నీటి సమస్య వస్తే తానే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి సమస్య నివారణకు చర్చించామని, ఇద్దరం కలిసి గవర్నర్‌ ఎదుట సమస్యను పరిష్కరించుకున్నామని చెబుతూ తెలంగాణలోని ఇతర సమస్యలకు కూడా ఇదే విధానాన్ని అవలంభిద్దా మని చంద్రబాబు నాయుడు కరీంనగర్‌ వేదికగా పిలుపునిచ్చారు. మొత్తంగా తెలంగాణ సమాజానికి తాను వ్యతిరేకం కాదని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్దే ముఖ్యమని ఈ పర్యటన ద్వారా చంద్ర బాబు చాటిచెప్పారు. విద్యుత్‌ను ఇచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యం తరం లేదని కూడా ప్రకటించారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలు విడి పోయినా తెలుగువారంతా మానసికంగా కలిసే ఉండాలని, కలిసి పని చేస్తేనే అభివృద్ది సాధ్యమని చెబుతూ తెలంగాణ అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని వెల్లడించడం ద్వారా టీడీపీవైఖరిని స్పష్టం చేశా రు. మాదిగల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, తొదరపడితే ప్ర యాజనం ఉండదని ఎమ్మార్పీఎస్‌కు సూచిం చారు. తద్వారా భవిష్యత్‌లో మాదిగల వర్గీకరణకు కృషి చేస్తామని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: