మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్‌ (గొడ్డు కూర)పై నిషేధం విధించడంపై బాలీవుడ్‌ ప్రముఖులు పలువురు మంగళవారం విమర్శలు గుప్పించారు. ఫరా అక్తర్‌, అయుష్మాన్‌ ఖురానా, రిచా చద్దా తదితరులు దీనిపై ట్విటర్లో పలు కామెంట్లు చేశారు.

ఇది మానవహక్కులను హరించడమేనని వారు పేర్కొన్నారు. గోవధను నిషేధిస్తూ రూపొందించిన బిల్లు ఒకటి ఎన్నో సంవత్సరాలుగా మహారాష్ట్రలో పెండింగ్‌లో ఉండగా సోమవారం రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేశారు. దర్శకుడు ఒనిర్‌ దీనిపై స్పందిస్తూ 'నేను ఏం తినాలో ప్రభుత్వం చెప్పకూడదు' అన్నారు.

మనదేశం భిన్న వర్గాల ప్రజల కలయిక అని, ఇప్పుడు ఈ నిషేధంతో ప్రభుత్వం ఆ హామీని ఇవ్వదనే భావన కలుగుతోందని ఆయన అన్నారు. తాను శాకాహారినేనని, బీఫ్‌ బ్యాన్‌ వెనుక ఉన్నది మతపరమైన రాజకీయాలని రిచా పేర్కొంది.

కామెడీ నటుడు వీర్‌దాస్‌ స్పందిస్తూ బీఫ్‌తో పాటు టీత్‌ (పళ్లు)ను కూడా నిషేధిస్తే ఇక ప్రజలంతా మెత్తని శాకాహారమే తింటారని, అప్పుడైనా బిజెపి నేతలు ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండాఉంటారని వ్యంగ్యోక్తోలు విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: