కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సెలవు పై ఢిల్లీ దద్దరిల్లి పోతుంటే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పదిరోజులపాటు సెలవులోకి పోతాడట. ప్రకృతి వైద్యం కోసం వెళ్తున్నట్లు మార్చి 5 నుంచి పదిరోజులపాటు కేజ్రీ సెలవు తీసుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీపార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెచ్చు పెరిగిన ఈ తరుణంలో... కేజ్రీ మెడికల్ లీవ్... చర్చనీయాంశమైంది.

మఫ్లర్ వాలా.. కొద్ది రోజులుగా విపరీతమైన దగ్గు, హై బ్లడ్ షుగర్.. వల్ల బాధపడుతున్నాడని, పదిరోజుల చికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ సమయంలో మనీష్ సిసోడియా తాత్కాలిక సీఎంగా వ్యవహరిస్తారు.

పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత భూషణ్, యోగేంద్ర యాదవ్.... సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిపై విరుచుకు పడడంతో.. పార్టీనుంచి వారిని బహిష్కరించే పరిస్థితి వచ్చింది. బుధవారం ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలోనే తాడో పేడో తేలిపోతుంది.

మరో పక్క పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు తనను బాధించాయని కేజ్రీవాల్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆప్ లో వన్ మేన్ షో జరుగుతోందని ఇప్పటికే విమర్శలు చేస్తున్న ప్రశాంత భూషణ్.. బుధవారం జాతీయ కార్యవర్గం సమావేశానికిహాజరు కాబోనని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: