బీజేపీ – ఎంఐఎం పార్టీలు ఇప్పటి వరకు ఉప్పు నిప్పులా, పాము, ముంగిసల్లా కాలం గడిపాయి. రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ మాత్రం అతీతమా .. మతం అయినా, దేశభక్తి అయినా అంతా అధికారం కోసమే అని బీజేపీ పార్టీ కూడా జమ్ముకాశ్మీర్ లో పీడీపీ పార్టీతో పొత్తుపెట్టుకుని తమ అసలు లక్ష్యాన్ని స్పష్టం చేసింది.

ఇంతవరకు హిందూ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ తన అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది. కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపాలన్న పీడీపీతోనే అధికారం పంచుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన తెలంగాణలో కూడా అదే ఎత్తు వేసి తమ పార్టీ లౌకిక పార్టీ అనే ముద్ర వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.

పీడీపీతో పొత్తుతో జమ్ముకాశ్మీర్ లో తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే సునాయాసంగా మేయర్ పీఠం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ విస్తరణకు వినూత్న వ్యూహాలతో ముందుకు వెళ్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలోనే హైదరాబాద్ రానున్నారని, ఈ మేరకు జాతీయ స్థాయిలో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తన వ్యూహ నైపుణ్యంతో ఉత్తరప్రదేశ్ లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచిన అమిత్ షా తెలంగాణలోనూ పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు పకడ్భందీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరి స్థానిక నాయకులు దీనికి ఏమంటారు ? ఈ పొత్తు విషయం ముందుకు సాగుతుందా ? లేదా వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: