‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ రాజధానికి వెళ్లి చూడటంలో తప్పులేదని ఆయన సూచనలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖమంత్రి నారాయణ అన్నట్లుగా వర్తున్న వార్తలు రేపు తుళ్ళూరు ప్రాంతంలో పవన్ చేపట్ట బోతున్న పర్యటన ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి.

అయితే ఇప్పటికే పవన్ ఈ పర్యటన తుళ్ళూరు రాజధాని గ్రామాల ప్రాంతంలో చేయవలిసి ఉన్నా కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలతో పవన్ పర్యటన రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనితో రేపు ఈ ప్రాంత రైతులతో పవన్ ఏమి చెప్ప బోతున్నాడు పవన్ చెప్పే మాటలకు రైతుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్న విషయం పై సర్వత్రా ఆ శక్తి నెలకొని ఉంది.

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంత గ్రామాలలో భూసమీకరణ ఇంచుమించు పూర్తి అయి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చిన నేపధ్యంలో పవన్ రైతుల దగ్గర నుండి ఏమి సూచనలు తీసుకుంటాడు ఒక వేళ రైతులు సూచనలు ఇచ్చినా అది ప్రభుత్వం వింటుందా అన్నది సమాధానం లేని ప్రశ్న.

ఈ వార్తలు ఇలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి పవన్ ను ఉద్దేసించి చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. గత ఎన్నికలలో మోడీకి మద్దతుగా ఇరు రాష్ట్రాలలోను పర్యటించి ఓట్లు వేయించిన పవన్ తన పరిచయాలతో ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెప్పించ గలిగితే చరిత్రలో నిలిచి పోతాడు కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకుండా తుళ్ళూరు ప్రాంతలో పర్యటనలు చేస్తే ఏమి లాభం అన్న కామెంట్స్ పవన్ పై ఏమైనా ప్రభావాన్ని చూపెడతాయా ? లేదంటే ఇప్పటికే ఎందరో రాజకీయ నేతలు తుళ్ళూరు ప్రాంత గ్రామాలలో జరిపిన పర్యటనలలో ఒక పర్యటనగా పవన్ పర్యటన మిగిలి పోతుందా? అన్నది రానున్న రోజులలో తేలనున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: