విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ మరోసారి దగాపడుతున్న వాస్తవాన్ని గ్రహించి ఓ బాధ్యత గల పౌరుడిగా, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాన్ స్పందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.... విభజన చట్టం, అప్పటి ప్రధాని ప్రకటన ప్రకారం రాష్ట్రానికి రావలసిన పన్ను రాయితీలు, ప్రత్యేక హోదా లాంటి వాటి సాధన కోసం మీరు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తారని వార్త విన్న మాకు సంతోషం కలిగింది . పన్ను రాయితీలు, ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు పూరించడం ఈ అంశాల గురించి మీకు తెలిసినవే అయినా కొన్ని విషయాలు మరొకసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాము.

వాస్తవానికి ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు చేయాల్సిన ఘనకార్యమే అయినా ప్రజలు నమ్మిన వ్యక్తిగా మీరు పూనుకోవడం ఎంతో మంచింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ కు పన్ను రాయితీలు, ప్రత్యేక హోదా సాధ్యం కావు అనే వివేకం తోటే ఆయన ఉత్తరాంధ్ర, రాయలసీమ లకు ప్రత్యేక హోదా గురించి గత ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపాదించారు. వీరిద్దరి గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అంటే.. ఎన్నికల సమయంలో పార్టీలు సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా ఎన్నో హామీలు ఇస్తుంటాయి. మరి వాటిలో రాష్ట్రానికి అత్యసరమైనవి వాస్తంగా అమలుపరచగలిగినవి ఏమిటో తేల్చుకుని ముందడుగు వెయ్యాలి. కేంద్రానికి సాధ్యం కానివి అడిగి లేదనిపించుకోవడం కన్నా వాళ్ల నుంచి నిధులు ఏ విధంగా రాబట్టు కోవాలో చూస్తే మంచింది.

60 సంవత్సరాల నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు, నీళ్ళు , నిధుల విషయం లో వివాదం కారణం గానే ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అవే పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు కూడా సమాన అవకాశాలు అందే ఏర్పాట్లు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రమే గాని, ఆంధ్ర ప్రజలు పేదవాళ్ళు కాదు. ఆంధ్ర లో నిజంగా పేదల సంఖ్య 40 శాతం లోపే. కాని సంక్షేమ పథకాలు మాత్రం 90 శాతం మందికి వర్తిస్తున్నాయి. ఈ విషయంలో ఆచూ తూచీ వ్యవహరించాలి కారణం ధనికులు పేదలు ఎవరూ అనేది సమగ్ర సర్వే నిర్వహించి నిదులు అసలైన పేదలకు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ వృధాని ఆపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్ని నిధులు తెచ్చుకున్నా సరిపోవు. తోటి వాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకున్నట్లు ...ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణతో సమానంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచారు. 43 శాతం జీతాలు పెంచినప్పుడు , కనీసం వారి పనితీరులో 4.3 శాతం అయినా మెరుగుదల ఆశించడం తప్పు కాదు, కానీ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచే దిశగా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం శోచనీయం.

కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకి ఇచ్చే నిధులని చర్చించి కొత్త రాష్ట్రాలను దృష్టిలో పెట్టకోమని వాటి అభివృద్దికి సహకరించాల్సింది కోరాలి. ఇంకా కేంద్రం దగ్గర బోలెడు నిధులున్నాయి. రాష్ట్రానికి చెందిన 25మంది ఎంపీలు క్రియాశీలంగా వ్యవహరిస్తే ఎన్నో నిధులు మనం రాబట్టుకోవచ్చు. ఈ దిశగా ఎంపీ లకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అవినీతి పట్టి పీడిస్తోంది. కాంట్రాక్టుల్లో అవినీతి ఆపితే కనీసం 20 శాతం నిధులు మిగులుతాయి. ఈ దిశగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు ఏమి చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: