గులాబీ గ్యాంగులో సీనియర్ బ్యాచీ పరేషాన్ లో పడిపోయింది. వాళ్ల బాధ అంతాఇంతా కాదు. పార్టీ షురూ నుంచి పనిచేసినా పట్టించుకునేవాళ్లే లేరని ఫీలయిపోతున్నారు. మొదటి నుంచి పార్టీ జెండాను మోసిన తమను కాదని సడెన్ గా కండువాలు కప్పుకుంటున్న వాళ్లకు పదవులి స్తున్నారని లోలోన మథనపడుతున్నారు. పార్టీలో కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్టుగా ఉందని సీనియర్లు చెబుతున్నారు.

ఉద్యమం టైంలో పార్టీ కోసం తమను నాన్ స్టాప్ గా వాడుకున్నారని, ఇప్పుడేమో తమవైపే చూడట్లేదని గుస్సా అవుతున్నారు. కొత్త నేతలకు, పాతవారికి సమన్వయం కుదరడం లేదని పరేషాన్ అవుతున్నారు. వాళ్ల చుట్టూ తిరగలేక తల ప్రాణం తోకకొస్తుందని ఫీలయిపోతున్నారు.

మంత్రులు తలసాని, తుమ్మల , కడియం , మహెందర్ రెడ్డి అనుచరుల హడావుడి ఎక్కువైందని ఉడుకుతున్నారు. వీళ్ల ముందు తమ సీనియరిటీ లెక్కలోకి రావడం లేదని నెత్తి కొట్టుకుంటున్నారు.కొంత మంది సీనియర్ నేతలు కొత్తవారికి సహకరించడం లేదు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా పార్టీలో బిన్న స్వరాలు వినపడుతున్నాయి. దేవిప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డిల కంటే అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకపోవడాన్ని ఇంటర్నల్ గా కొంతమంది సణుగుతున్నారు. నామినేటేడ్ పోస్టుల్లోనైన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు సీనియర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: