హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మరోసారి ఇండియాలోనే ది బెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది. ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మెర్నర్ నిర్వహించిన సర్వేలో భారత దేశంలోని నగరాల్లో హైదరాబాదే ముందువరుసలో నిలిచి తన ఘనత చాటుకుంది.

ఆ మధ్య ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా ఎన్నికైన హైదరాబాద్.. ఇలా అంతర్జాతీయ సర్వేల్లో అగ్రస్థానంలో నిలుస్తూ సత్తా చాటుకుంటోంది. మెర్నర్ సంస్థ ప్రపంచంలోని మొత్తం 440కి పైగా నగరాల్లో సర్వే నిర్వహించింది. అత్యంత నివాసయోగ్య నగరాల జాబితా తయారుచేసింది. భారత్ నుంచి ఆ జాబితాలో హైదరాబాద్, పుణే, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా మాత్రమే చోటు సంపాదించుకున్నాయి. వాటిలో హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

మెర్సర్‌ సంస్థ ఈ ర్యాంకింగ్ లను క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌ పేరుతో విడుదల చేసింది. పౌరసేవలకు ఈ సర్వేలో ప్రాధాన్యం ఇచ్చారు. ఇండియాలో హైదరాబాద్ 138 వస్థానంతో .. దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో పుణె (145), బెంగళూరు (146) ఈ ఘనత పొందాయి. చెన్నై(151), ముంబై(152), ఢిల్లీ (154), కోల్‌కతా (160) పేర్లు ఆ తర్వాత స్థానాల్లో కనిపించాయి.

హైదరాబాద్ కు ఈ ఘనత లభించడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైంది విద్య సౌకర్యాలు.. భాగ్యనగరంలో అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యాలయాల సంఖ్య బాగా పెరిగింది. వీటికితోడు ప్రముఖ నగరాలైన ఢిల్లీ, చెన్నై, కోల్ కతాల్లో రద్దీ విపరీతంగా పెరిగి.. జీవన ప్రమాణ సౌకర్యాలు తగ్గిపోయాయి. హైదరాబాద్ కు ఉన్న చారిత్రక వారసత్వ నేపథ్యం, కట్టడాలు కూడా హైదరాబాద్ కు ప్లస్ పాయింట్లయ్యాయి. మెరుగుపడిన వైద్య, రవాణా, వినోద సేవలు... కాలుష్యం తక్కువగా ఉండటం. తక్కు ఇంటి అద్దెలు వంటి విషయాలు కూడా భాగ్యనగరాన్ని దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: