జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. పవన్ కల్యాణ్ ఈ పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్తున్నారు. ఇప్పటివరకూ ఆయన రాజకీయ సభల్లో ప్రసంగించినా.. అవి బహిరంగ సభలు మాత్రమే.. నేరుగా ప్రజల్లోకి ఇప్పటివరకూ వెళ్లిందిలేదు.

తుపానుల సయమయంలో, ఇతర సందర్భాల్లోనూ జనంలోకి పవన్ వెళ్లినా.. అవి సానుభూతి పర్యటనలు తప్ప రాజకీయ పర్యటనలు కావు. కానీ ఈ తుళ్లూరు పర్యటన పవన్ కు ఛాలెంజింగ్ టాస్క్ లాంటింది. రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజధాని అంశంపై పవన్ పర్యటన.. ఆయన అభిమానుల్లోనే కాకుండా.. అందరిలోనూ ఆసక్తిరేపుతోంది.

ఈ పర్యటనలో కేవలం రైతుల ఆవేదన మాత్రమే వింటారా.. లేక.. ఏమైనా సంచలన వ్యాఖ్యలు చేస్తారా అన్ని ఇంట్రస్టింగ్ టాపిక్. ఓవైపు టీడీపీకి మిత్రపక్షంగా ఉంటూ.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించే అవకాశం తక్కువే. అందులోనూ.. పవన్ ముందే చంద్రబాబును కలిసి మరీ ఈ టూర్ కు వస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు పవన్‌ అభిమానులు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

పవన్ గురువారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలతో కాసేపు మాట్లాడతారు. తర్వాత రోడ్డు మార్గాన ఉండవల్లి వెళ్తారు. అక్కడ పొలాలను పరిశీలిస్తారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకొంటారు. ఆ తర్వాత యర్రబాలెం, బేతపూడి, తుళ్లూరు గ్రామాల్లోనూ రైతులతో చర్చిస్తారు. పవన్ టూర్ మధ్యాహ్నం వరకూ ముగిసిపోతుంది. ఆ తర్వాత గన్నవరానికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: