440కిపైగా నగరాల్లో నిర్వహించిన సర్వేలో అత్యంత నివాసయోగ్య నగరాల జాబితా తయారుచేయగా.. దేశంలో ప్రథమంగా, జీవన ప్రమాణాల్లో భారతీయ నగరాల్లోనే మన హైదరాబాద్‌ను ఉత్తమంగా నిలిచింది. అంతర్జాతీయంగా పేరొందిన నగరాల్లో 138వ స్థానంలో భాగ్యనగరి నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ‘మెర్సర్‌’ 2015కుగాను ఈ సర్వే నిర్వ హించి..

‘మెర్సర్‌ 2015 క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌’ పేరిట నివేదిక విడుదల చేసింది. పౌరసేవల కోణంలో దేశంలోనే అత్యున్నతమైనదిగా హైదరాబాద్‌కు కిరీటం తొడిగింది. భారత్‌ లో 7నగరాలను గుర్తించగా, హైదరాబాద్‌ తర్వాత పుణె (145), బెంగళూరు (146) ఈ ఘనత పొందాయి. చెన్నై(151), ముంబై(152), ఢిల్లీ (154), కోల్‌కతా(160) పేర్లు ఆ తర్వాత స్థానాల్లో కనిపించాయి.

‘హైదరాబాద్‌లో ముఖ్యంగా విద్యాపరంగా మౌలికమైన అభివృద్ధి కనిపిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యాలయాల సంఖ్య బాగా పెరిగింది. ఆంగ్ల బోధన ప్రధానంగా గల స్కూళ్లు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి’ అని ‘మెర్సర్‌’ భారత ప్రతినిధి రుచికాపాల్‌ తెలిపారు.

కేవలం 22 కిలోమీటర్లలోనేగల అంతర్జాతీయ విమానాశ్రయం కలిసి వచ్చిందని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో రద్దీ పెరిగిపోయినీరు, నిత్యావసరాలు అందని పరిస్థితి ఉన్నదని తెలిపింది.ఈ సర్వేలో రాజకీయ, ఆర్థిక సామాజిక-సాంస్కృతిక వాతావరణం, వైద్య సంరక్షణ, విద్య, పౌర సేవలు, రవాణా, వినోద సౌకర్యాలు, ఆహారం, గృహ లభ్యత, కాలుష్యం లేని/తక్కువగా ఉండే వాతావరణం తదితరాలను ప్రమాణంగా తీసుకుని మెర్సర్‌ సంస్థ ర్యాంకింగ్‌లిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: