మనిషి ఎంత అందంగా ఉన్నా ఆ అందంలో ముఖ్య పాత్ర వహించేది శిరోజాలే.. అజాను బాహుడిలా అందంగా ఉండి జుట్టు లేకపోతే పూర్తిగా బట్టతల అయితే చూడటానికి బాగోదు.. అందంగా అపురూప సౌందర్యం కలిగిన ఉండి శిరోజాలు సరిగా లేకపోతే అంతగా ఆకర్షించలేరు. మరి ఆ జుట్టును కాపాడుకునే చిట్కాలు చూద్దామా ..

దాల్చిన చెక్క మరియు తేనె: ఇబ్బంది కలిగించే ఎగ్ స్మెల్ నివారించడానికి దాల్చిన చెక్క మరియు తేనె గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో యాంటీఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఒక కప్పు వేడి నీళ్ళలో అర చెంచా దాల్చిన చెక్కవేసి 30నిముషాలు నాననివ్వాలి . తర్వాత ఆ నీటిలో ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని మీ తలకు మరియు జుట్టు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

ఆరెంజ్ జ్యూస్: జుట్టు నుండి ఎగ్ స్మెల్ నివారించడానికి ఆరెంజ్ జ్యూస్ ఇది చాలా విలువైన చిట్కా. ఆరెంజ్ జ్యూస్ జుట్టుకు మంచి సువాసన అందిస్తుంది మరియు తల మరియు కేశాల నుండి అదనపు నూనెను తొలగిస్తుంది. తాజా ఆరెంజ్ జ్యూస్ ను మీ జుట్టుకు పట్టించి 5 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. వెనిగర్: జుట్టు నుండి ఎగ్ స్మెల్ నివారించడంలో వెనిగర్ చాలా ఎఫెక్టివ్ చిట్కా. దాని కంటే మందుగా వెనిగర్ వల్ల జుట్టు కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి. ఇది జుట్టు చిక్కుబడకుండా నివారిస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది. కేశాలను శుభ్రపరుస్తుంది. జుట్టు సంబంధిత అన్ని సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

లెమన్ జ్యూస్: లెమన్ జ్యూస్ జుట్టు మరియు చర్మ సంరక్షణకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం తల మరియు జుట్టు శుభ్రం చేయడంతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుంది. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత నిమ్మరసం వాటర్ ను జుట్టుకు స్ప్రే చేయాలి . ఈ వాటర్ ను కొద్ది సేపు కేశాల మీద అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో తలస్నానం చేసుకోవాలి. బేకింగ్ సోడ: బేకింగ్ సోడా ఒక ఎఫెక్టివ్ చిట్కా. ఇది జుట్టు నుండి ఎగ్ స్మెల్ ను నివారిస్తుంది . ఇది మీ జుట్టు నుండి జిడ్డును నివారిస్తుంది . కొద్దిగా నీరు తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసిమిక్స్ చేసి పెట్టుకోవాలి. తలను నీటితో తడిపి తర్వాత బేకింగ్ సోడా వాటర్ ను అప్లై చేయాలి . 5 నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: